వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొన్ని నెలల క్రితం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ సినిమా కోసం లక్ష్మీ పార్వతి నుండి కూడా ఆయన అనుమతి తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నిజ చరిత్రను తెలియజేయడంతో పాటు, చంద్రబాబు అసలు రంగును కూడా తాను బయట పెడతాను అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్ నుండి చంద్రబాబు నాయుడు ఎలా అధికారాన్ని లాక్కున్నాడనే విషయాన్ని తన సినిమాలో ప్రముఖంగా చూపిస్తానంటూ ప్రకటించిన వర్మ ఆ తర్వాత కొన్నాళ్ల వరకు కనిపించకుండా పోయాడు. మళ్లీ ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో సందడి చేస్తున్నాడు.
త్వరలో సినిమాకు సంబంధించిన కీలక విషయాలను ప్రకటిస్తాను అంటూ ఇటీవలే ట్వీట్ చేసిన వర్మ తాజాగా అచ్చు చంద్రబాబులా కనిపిస్తూ, ఒక హోటల్ లో వెయిటర్ గా పని చేస్తున్న వ్యక్తి ఆచూకి తెలపండి, వారికి లక్ష రూపాయల బహుమానం ఇస్తాను అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. నిజంగా చంద్రబాబు నాయుడులా ఉన్న ఆ వ్యక్తి వీడియో ఎంతలా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతగా వైరల్ అయిన వీడియోలో ఉన్న వ్యక్తి వర్మకు చిక్కేశాడట. ఆ విషయాన్ని స్వయంగా వర్మ ప్రకటించాడు.
వర్మ ట్విట్టర్ లో... హాయ్ రోహిత్, లక్ష్మీస్ ఎన్టీఆర్ యూనిట్ కు సిబిఎన్ ను బహుమానంగా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు, మీకు థ్యాంక్స్ చెబుతూ సినిమా ఆరంభంకు ముందే టైటిల్ కార్డ్ లో మీ పేరు వేస్తాను అంటూ హామీ ఇచ్చాడు. దాంతో పాటు నేను ముందు చెప్పినట్లుగా మీకు లక్ష రూపాయలు వేస్తాను, మీ అకౌంట్ వివరాలను నాకు పంపించండి అంటూ వర్మ ట్వీట్ చేశాడు.
మొత్తానికి వర్మ అనుకున్నది సాధించాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మొదటి విజయం దక్కించుకున్నట్లుగానే ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్వరగా ఈ సినిమాను చేయాలని వర్మను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జనాలు కోరుతున్నారు. మొదట వీడియోలో ఉన్న ఆ వ్యక్తిని మీడియా ముందుకు తీసుకు రావాల్సిందిగా మరికొందరు వర్మను కోరుతున్నారు.