రీల్ ఎన్టీఆర్ డీటెయిల్స్ ఇచ్చిన ఆర్జీవి

Update: 2019-03-29 17:23 GMT
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఫైనల్ గా రిలీజ్ అయింది. హైకోర్టు ఆర్డర్ వల్ల ఏపీలో మాత్రం రిలీజ్ కాలేదు. అక్కడ తప్ప మిగతా ప్రపంచం అంతా సినిమా రిలీజ్ అయింది.  సినిమా ఎలా ఉంది అనేది ఇప్పటికే సినిమాను చూసినవారికి.. చూడని వారికి.. రివ్యూలు చదివిన ప్రేక్షకులందరికీ తెలిసిపోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ విషయం గురించి చర్చించనవసరం లేదు.

ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం ఒకదాన్ని పంచుకున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పోషించిన నటుడికి సంబంధించిన వివరాలు మనకు పెద్దగా తెలియవు కదా. ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు వెల్లడించాడు వర్మ.  ఆయనపేరు విజయ్ కుమార్ అని.. వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన వ్యక్తి.. నాటక రంగ నేపథ్యం ఉందని తెలిపాడు.  అంతే కాదు విజయ్ కుమార్ మెథడ్ యాక్టింగ్ తీవ్రంగా ప్రాక్టిస్ చేసిమరీ ఎన్టీఆర్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడని వెల్లడించాడు ఆర్జీవి.

తెరపై ఎన్టీఆర్ లా కనిపించింది విజయ్ కుమార్ అయితే ఆయనకు డబ్బింగ్ చెప్పిన వ్యక్తి పాపులర్ టాలీవుడ్ పాటల రచయిత కమ్ సింగర్ విశ్వ.  విజయ్ కుమార్.. విశ్వ కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ "లెఫ్ట్ లో విశ్వ.. ఎన్టీఆర్ కు గాత్రం అందించిన వారు.. రైట్ లో విజయ్ కుమార్ ఎన్టీఆర్ పాత్ర పోషించినవారు.. ఇద్దరూ కలిసి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లో ఎన్టీఆర్ ను మన ముందుకు తీసుకొచ్చారు" అని తెలిపాడు వర్మ.  ఈ సినిమాతో విజయ్ కుమార్ కు కొత్త అవకాశాలు లభించడం.. టాలీవుడ్ లో యాక్టర్ గా స్థిరపడడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News