మెగా చెట్టుకు వరుణ్ గౌరవమిస్తాడు

Update: 2015-12-08 07:25 GMT
వరుణ్ తేజ్ హీరోగా పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో రూపొందిన చిత్రం లోఫర్. రీసెంట్ గా ఈ మూవీ ఆడియో ఫంక్షన్ ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు తప్ప మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించలేదు. ఫంక్షన్ కి వచ్చిన నాగేంద్రబాబు కూడా స్టేజ్ పైకి మాత్రం ఎక్కలేదు. ఇదంతా బాగా అబ్జర్వ్ చేసినట్లున్నాడు మరో గెస్ట్ గా వచ్చిన రామ్ గోపాల్ వర్మ.

సాధారణంగానే ప్రతీ సందర్భానికి ఏదో ఒక పంచ్ విసిరే వర్మ.. తనకు మైక్ ఇవ్వగానే కౌంటర్ వేసేశాడు. "మెగా చెట్టు ఇచ్చే కరెంట్ అవసరం లేకుండానే వరుణ్ తేజ్ ఎదుగుతున్న తీరు నాకు నచ్చింది. అతనికి సొంతగా సోలార్ బ్యాటరీ ఉంది. అదే చెట్టు ఇచ్చే కరెంట్ మీద ఆధారపడితే కొన్నాళ్లకు అసలు పవర్ ఉండదు. పవర్ స్టార్ - మెగాలు ఇచ్చే ఎలక్ట్రిసిటీ అవసరం లేకుండా ఎదగడమే స్టార్ పవర్" అంటూ ఇంగ్లీష్ లో దంచేశాడు వర్మ. ఆ తర్వాత తను చెప్పినది మళ్లీ అందరికి అర్ధం కాకపోతే అని డౌట్ వచ్చినట్లుంది ఆయనకు. అందుకే తెలుగులోకి వచ్చేసి "వరుణ్ తేజ్ చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే బ్యాచ్ కాదు. చెట్టుకు గౌరవం ఇస్తాడు కానీ.. కొమ్మలాగా బతకడం కోరుకోడు" అనేశాడు వర్మ.

ఫంక్షన్ కి వచ్చినోళ్లు హీరో పొగడ్డం కామనే కానీ.. వర్మ చెప్పిన మాటల్లో మెగా స్టార్ - పవర్ స్టార్ - చెర్రీ - అల్లు అండ్ టీం సహా అందరికీ ఇన్ డైరెక్ట్ పంచ్ ఉందని అర్ధమవుతూనే ఉంది. మరి వర్మ కౌంటర్ కి మెగా టీం నుంచి రిప్లై ఎలా ఉంటుందో ?
Tags:    

Similar News