అయ్యయ్యో.. ట్విట్టర్ ని వర్మ వదిలేశాడే

Update: 2017-05-28 04:45 GMT
ఎనిమిదేళ్లకు పైగా సావాసానికి తెరపడిపోయింది. అనుబంధాన్ని అర్ధాంతరంగా వదలియేడమే కాదు.. ఏకంగా చంపేశాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. సినిమాల్లో సెన్సేషన్స్ అయిపోయిన తర్వాత.. సెన్సేషనల్ ట్వీటర్ గా గుర్తింపు సంపాదించుకుని.. ఇన్నేళ్లు ఈయనను జనాల్లో వార్తల్లో నానేందుకు ఉపయోగపడ్డ ట్విట్టర్ అకౌంట్ కు చరమగీతం పాడేశాడు వర్మ.

రామ్ గోపాల్ వర్మ.. rgvzoomin పేరుతో ట్విట్టర్ పేజ్.. ఈ రెండిటికి ఉన్న బంధం ఇప్పుడు కట్ అయిపోయింది. ట్విట్టర్ వదిలేసి ఇకపై ఇన్ స్టాగ్రామ్ లో  కొనసాగాలని వర్మ డిసైడ్ అయ్యాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారానే చెప్పిన వర్మ.. ఇందుకు రీజన్ మాత్రం చెప్పలేదు. 'నిర్లక్ష్యతతో కూడిన ఆశ్చర్యకరమైన విషయాన్ని ఎంతో వినమ్రంగా చెబుతున్నా. నేను ట్విట్టర్ నుంచి వెళ్లిపోతున్నా. ఇన్నేళ్లు నన్ను ఫాలో అయిన వారికి ఎలాంటి కృతజ్ఞతలు చెప్పను' అని ట్వీట్ చేసిన వర్మ.. ఆ తర్వాత ఆఖరి ట్వీట్ ఇలా పెట్టాడు.

'ట్వీట్ మరణానికి ముందు నా ఆఖరి ట్వీట్ ఇది. అలాగని నేనేమీ ప్రశాంతంగా ఉండను. ఇకపై సీరియస్ గా పని చేస్కుంటా.  @RGVzoomin పుట్టుక:27/5/2009 మరణం: 27/5/2017' అంటూ చివరి ట్వీట్ పెట్టాడు వర్మ. ఇప్పుడీ పేజ్ ట్విట్టర్ నుంచి మాయమైపోయింది కూడా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News