ఎక్స్ క్లూసివ్ ఇంట‌ర్వూ - అసలు బాల‌కృష్ట‌-నాగ‌బాబు ఏం మాట్లాడారో నాకు తెలియ‌దు, నేను చూడ‌లేదు

Update: 2020-06-06 10:30 GMT
ఎక్స్ క్లూసివ్ - విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌తో స్పెష‌ల్ చిట్ చాట్

అబ‌ద్ధాలు కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెబుతాడు, అబ‌ద్ధాల్ని కూడా నిజం అని ఒప్పించే కెపాసిటి ఉన్నోడు, సినిమా ఇండ‌స్ట్రీ క‌రోనా ప్ర‌భావంతో షూటింగ్స్ ఆపేసుకొని ఇంట్లో కుర్చుంటే, ఆర్జీవి మాత్రం సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. థియేట‌ర్స్ మూసేసినా, ఆడియెన్స్ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోకే సినిమాని తీసుకొచ్చి, ఎనీ టైమ్ థియేట‌ర్ ప‌ద్ధ‌తిని మొద‌లు పెట్టిన ఆర్జీవితో తుపాకీ డాట్ కామ్ స్పెష‌ల్ చిట్ చాట్

గ‌మ‌నిక - ఇంట‌ర్వూలో మొద‌టి ప్ర‌శ్న‌లు, అదే ఇంట‌ర్వూ మొద‌లు పెట్ట‌డానికి అడిగే కుశ‌ల ప్ర‌శ్నలు అంటే ఆర్జీవికి చిరాకు, సో అలాంటివి లేకుండానే స్ట్రైయిట్ గా డిస్కష‌న్ లోకి వెళ్లిపోవ‌డం జ‌రిగింది


* ఆర్జీవీ గారు క‌రోనాకి కార‌ణం మాన‌వ త‌ప్పిదాలు, నేచ‌ర్ కి విరుద్ధంగా మాన‌వాళి ఉండటం వ‌ల్లే ఇలాంటి వ్యాధ‌లు వ‌స్తున్నాయి అని కొంద‌రు వాద‌న‌, దీని గురించి మీరు ఏమంటారు

ప్ర‌కృతికి విరుద్ధంగా బ్ర‌త‌క‌డం వ‌ల్లే క‌రోనా వ‌చ్చింది అనే వాద‌న‌ను నేను ఒప్పుకోను అస‌లు ప్ర‌కృతితో ఎలా బ్ర‌తకాలో ఎక్క‌డైనా రాసి ఉందా, సెట్ ఆఫ్ రూల్స్ గ‌వ‌ర్న‌మెంట్ ఏమైనా రిలీజ్ చేసిందా. భూమి పుట్టిన‌ప్ప‌ట్టి నుంచి నేచుర‌ల్ డిజాస్ట‌ర్స్ వ‌స్తూనే ఉన్నాయి. అలా వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా లివింగ్ బియింగ్స్ ఎలాగోలా ట్రాన్సఫార్మై బ్రతుకుతూనే ఉన్నాయి క‌దా. సునామీ రాక ముందు ఎవ్వ‌రికి తెలియ‌దు, వ‌చ్చాక అలాంటి విప‌త్తు నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలో మార్గాలు వెతుకుతూనే ఉన్నాము క‌దా. క‌రోనా కూడా అలాంటిదే. దీనికి మాన‌వ త‌ప్పిదాలు అంటూ కార‌ణాలు త‌వ్వుకోవం మానేసి ఆ సో కాల్డ్ ఎక్స్ ప‌ర్ట్స్ అంతా క‌రోనా నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలో చెబితే అంద‌రికి హెల్ప్ అవుతుంది.

* క‌రోనా కార‌ణంగా ఎక్కువ న‌ష్ట‌పోయిన సెక్టార్స్ లో చిత్ర ప‌రిశ్ర‌మ ఉందంటున్నారు, నిజ‌మేనంటారా

క‌రోనా వ‌ల్ల ఎక్కువ న‌ష్ట‌పోవడం, తక్కువ న‌ష్ట‌పోవ‌డం ఉండ‌దు. ప్ర‌స్తుతం ప్ర‌పంచం మొత్తం ఆగిపోయింది. మ‌నంద‌రం ఇండ‌స్ట్రీలో ఉండ‌టం వ‌ల‌న‌, మ‌న ప‌ర్స‌పెక్టివ్ లో మ‌న‌కు ఎక్కువ న‌ష్టం క‌లిగిందేమో అని మ‌నం అనుకుంటున్నాము.

* చిత్ర పరిశ్ర‌మ మొత్తం ఆగిపోయిన మీరు ఆగ‌లేదుగా

(న‌వ్వులు, చాలా గ‌ట్టిగా న‌వ్వుతూ) ఎస్ మీరు అన్న‌ది నిజం, నా విష‌య‌మే తీసుకోండి, నేను ప్రొడ‌క్ష‌న్ ఆప‌లేదు. లాక్ డౌన్ లో కూడా నేను సినిమాలు రెడీ చేస్తున్నాను , రిలీజ్ చేస్తున్న‌. ఇక్క‌డ ఎవ్వ‌డి ప‌ని వాడు చేసుకుంటూ పోతాడు. ఇంకొక్క‌డి గురించి ఆలోచించేంత టైమ్ ఎవ్వ‌రికి లేదు అని నేను బ‌లంగా నమ్ముతున్నాను .

* క్లైమాక్స్ పై మ్యాడ్ మ్యాక్స్ ప్ర‌భావం ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది, నిజ‌మేనా

గుడ్ అబ‌జ‌ర్వేష‌న్, ఎస్ క్లైమాక్స్ మేకింగ్ మొత్తం ఇంగ్లీష్ మూవీ  మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ స్టైల్ లో తీసాను. అయితే మేకింగ్ మాత్ర‌మే ఆ స్టైల్ లో ఉంటుంది. అలానే క్లైమాక్స్ మొత్తం ఎడారిలోనే తియ్య‌డంతో కొంత‌మెర మ్యాడ్ మ్యాక్స్ ఛాయ‌లు క‌నిపిస్తాయి. అయితే ఇది కంప్లీట్ గా డిఫ‌రెంట్ మూవీ, స‌ర‌దాగా వెకేష‌న్ కి వెళ్లిన కపూల్ కి ఎదురైన వింత అనుభ‌వాలు క‌థాంశంతో క్లైమాక్స్ రెడీ చేశాను. ఇంకో విష‌యం ఈ సినిమా మీద ప్ర‌చారం అవుతున్న‌ట్లుగా ఇదెదో సెక్స్ బేస్డ్ మూవీ కూడా కాదు. ఇదో కంప్లీట్ హారర్ థ్రిల్ల‌ర్. అలానే మొట్ట మొద‌టి సారిగా డే లాట్ లో సిద్ధ‌మైన హార‌ర్ మూవీ.

* ప‌గ‌టి పూట కూడా దెయ్యాలు తిరుగుతాయ‌ని నిరూపిద్దామ‌నుకుంటున్నారా

(న‌వ్వులు) ఎస్ అంతే అనుకోండి. కొత్త‌గా ఉంద‌ని ట్రై చేశాను. అస్సులు భ‌య‌నాకి టైమ్ తో సంబంధం ఏం ఉంటుంది చెప్పండి.

* ఎనీ టైమ్ థియేట‌ర్ అనే కొత్త ప‌ద్ధ‌తిని అందుబాటులోకి తీసుకువ‌చ్చారు, దీని వ‌ల‌న థియేట‌ర్ వ్యూయ‌ర్ షిప్ కి దెబ్బ ప‌డుతుంద‌ని ట్రేడ్ ఎక్స్ ప‌ర్ట్స్ కొంద‌రు అంటున్నారు, మీరేమంటారు

ఆ వ్య‌వ‌స్థ స‌రిగా లేక క‌దా ఇలాంటి ఆల‌ట‌ర్నేట్ మీడియ‌మ్స్ వ‌స్తున్నాయి. థియేట‌ర్ - డిస్ట్రీబ్యూష‌న్ వ్య‌వ‌స్థ క్రిస్ట‌ల్ క్లియ‌ర్ గా ఉంటే ఇలాంటివి రావు క‌దా. ఒక‌టి ఒప్పుకుంటాను, ఇలాంటి డిజిటిల్ వ్యూయింగ్ మీడియ‌మ్స్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా కొంత‌మెర రెసిస‌టన్స్ వ‌స్తోంది. అలానే థియేట‌ర్స్ రెవెన్యూ కూడా ద‌గ్గిపోయే ఛాన్సులు ఉంటాయి. అయితే మేము తీసే సినిమాలు ఎందులో చూడాలో డిసైడ్ చేయాల్సింది ఆడియెన్స్. వారికి న‌చ్చిన చోట సినిమాను ఎక్స్ పీరియ‌న్స్ చేసే హ‌క్కు, అవ‌కాశం వారికే ఇవ్వాలి, అయితే టెక్నాల‌జీ మారుతూ వ‌స్తోంది. ఇంట్లో కుర్చొని హాయిగా సినిమా చూసే అవ‌కాశం ఉన్నోళ్లు అలానే చూస్తారు.  100 మీట్ల‌రు దూరంగా కుర్చొని, 70 ఎమ్ ఎమ్ స్క్రీన్ చూడ‌టానికి,  3 అడుగులు దూరంలో కుర్చొని 40 ఇంఛీలు స్క్రీన్ చూడ‌టంటో పెద్ద తేడా ఉండ‌దు అని నేను అనుకుంటున్నాను . అలానే ఇంట్లో అయితే మ‌న చేతిలోనే సౌండ్ ఉంటుంది.

* బాల‌కృష్ట‌ - నాగ‌బాబుగారు మ‌ధ్య జ‌రిగిన వ‌ర్డ్స్ ఎక్సెంజ్ పై మీ స్పంద‌న ఏంటి

అసలు వాళ్లు ఏం మాట్లాడారో నాకు తెలియ‌దు, నేను చూడ‌లేదు, కాబ‌ట్టి నేను వాటి మీద స్పదించ‌లేను.

* మీ క్లైమాక్స్ కి మీరు తీసుకువ‌చ్చిన ఎనీ టైమ్ థియేట‌ర్ ఎక్స్ పీరియ‌న్స్ కి అద్భుత‌మైన స్పంద‌న రావాల‌ని మా తుపాకీ డాట్ కామ్ మ‌నః స్పూర్తిగా కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్

థ్యాంక్యూ
Tags:    

Similar News