పెళ్లి చేసుకోవటం.. ఆ తర్వాత విభేదాలతో విడిపోవటం లాంటివి సినీ నటీనటుల జీవితాల్లో తరచూ కనిపిస్తుంటాయి. ఇలాంటి కోవకే చెందిన నాటి అందాల భామ రంభ ఫ్యామిలీ మ్యాటర్ ఊహించని రీతిలో మలుపులు తిరిగి.. ఎట్టకేలకు సుఖాంతమైంది. టాలీవుడ్ లో అగ్రశ్రేణి నటిగా ఒక ఊపు ఊపేసిన రంభ.. 2010లో కెనడాకు చెందిన బిజినెస్ మ్యాన్ ఇంద్రన్ కుమార్ ను పెళ్లి చేసుకొని సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి విదేశాలకు వెళ్లిపోయారు. అనంతరం వీరికి ఇద్దరుపిల్లలు. ఆ మధ్యన ఈ జంట ఎంత అన్యోన్యంగా ఉంటారన్న విషయాన్ని ఒక టీవీ షోలో చూసిన వారంతా హ్యాపీగా ఫీలయ్యారు.
అంతలోనే ఏమైందో ఏమో కానీ.. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావటం.. 2016లో రంభ చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకులకు పిటీషన్ దాఖలు చేశారు. అప్పటివరకూ ఎంతో అన్యోన్యంగా ఉన్న జంట మధ్య మనస్పర్థలు ఎందుకు స్టార్ట్ అయ్యాయన్నది పెద్ద మిస్టరీగా మారింది. ఇదిలా ఉండగా.. విడాకులతో పాటు.. పిల్లల సంరక్షణ కోసం నెలకు రూ.2.50లక్షలు చెల్లించాలని రంభ కోర్టును కోరింది. తన అభ్యర్థనకు తగ్గట్లు కోర్టు ఆదేశాలు ఇవ్వాలంది.
ఈ విడాకుల అంశంపై పలుమార్లు విచారణ జరిపిన కోర్టు.. ఇరువురి మధ్య సయోధ్య నెలకొల్పటానికి ప్రయత్నాలు జరిగాయి. మొత్తానికి మనసు మార్చుకున్న రంభ.. తన భర్తతో కలిసి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరటం.. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు జరిగిపోయాయి. తాజాగా ఇరువురు కలిసి చర్చించుకొని.. విడాకులు వద్దని.. కలిసి జీవించాలని నిర్ణయించారు. తమ నిర్ణయాన్ని కోర్టుకు తెలపటంతో విడాకుల కేసును మూసివేస్తున్నట్లుగా జడ్జి ప్రకటించారు. వివాహబంధంలో మనస్పర్థలు మామూలు. వీలైనంతవరకూ ఇరువురు కాస్త తగ్గి.. ఇగోల్ని పక్కన పెడితే.. విడాకుల కేసులు సగం ఇదే తీరులో సుఖాంతమయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా రంభ వైవాహిక జీవితంలో ఇకనైనా ఎలాంటి సమస్యలు రాకూడదని ఆశిద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/