ఇన్నాళ్ల‌కు చ‌ర‌ణ్ డ్రీమ్ నెర‌వేరింద‌ట‌

Update: 2022-04-06 02:30 GMT
`సైరా న‌ర‌సింహారెడ్డి` వంటి పీరియాడిక‌ల్ డ్రామా త‌రువాత మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న క్రేజీ చిత్రం `ఆచార్య‌`. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కు సిద్ధ‌మ‌వుతోంది. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్ లుగా న‌టించిన ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. సిద్ధాగా న‌క్స‌లైట్ పాత్ర‌లో  రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి.

13 ఏళ్ల కెరీర్‌లో తొలి సారి తండ్రి మెగాస్టార్ తో క‌లిసి చ‌ర‌ణ్ న‌టించిన సినిమా ఇది. ఈ మూవీని తెర‌పై వీక్షించాల‌ని ఫ్యాన్స్ తో పాటు చ‌ర‌ణ్ కూడా చాలా ఎక్సైటెడ్ గా వున్నార‌ట‌. గ‌త కొంత కాలంగా నాన్న‌తో క‌లిసి న‌టించాల‌ని ఎదురుచూస్తున్న నాకు `ఆచార్య‌`తో ఆ క‌ల నెర‌వేరింద‌ని చ‌ర‌ణ్ ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా తండ్రి చిరుతో క‌లిసి న‌టించ‌డం పట్ల ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాన్ని చ‌ర‌ణ్ వెల్ల‌డించారు.

ఈ చిత్రంలో ఓ న‌టుడిగా, స్టార్ గా ఈ చిత్రంలో అడుగుపెట్ట‌లేద‌ని, ఓ స్టూడెంట్ గా మాత్ర‌మే అడుగుపెట్టాన‌ని తెలిపారు. అంతే కాకుండా ఈ మూవీ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో నాన్న నుంచి చాలా నేర్చుకున్నాన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌త్యేకమైన విష‌యం ఏంటంటే ఈ మూవీ షూటింగ్ లో నాన్న నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. నేను మిస్టేక్స్ చేస్తున్నా వ‌న్ మోర్ టేక్ తీసుకుంటున్నా ఎక్క‌డా న‌న్ను డిస్ట్ర‌బ్ చేయ‌లేదు. చాలా కూల్ గా స‌పోర్ట్ చేశారు. ఈ విష‌యంలో నాన్న‌కు రుణ‌ప‌డి వుంటాను` అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి గ‌తంలో చ‌ర‌ణ్ న‌టించిన చిత్రాల్లో గెస్ట్ గా క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. `మ‌గ‌ధీర` చిత్రంలోని `బంగారు కోడి పెట్ట..` పాట‌లోనూ.. అలాగే `బ్రూస్ లీ` చిత్రంలోని ప‌తాక ఘ‌ట్టంలో వ‌చ్చే ఫైట్ సీక్వెన్స్ లోనూ అతిథి పాత్ర‌ల్లో మెరిసి ఫ్యాన్స్ కి పూన‌కాలు తెప్పించారు. ఇక చ‌ర‌ణ్ కూడా చిరు న‌టించిన `ఖైదీ నం.150` లోని `అమ్మ‌డూ లెట్స్ డూ కుమ్ముడూ..` పాట‌లో చ‌ర‌ణ్ త‌ళుక్కున మెరిన విష‌యం తెలిసిందే. అయితే పూర్తి స్థాయి పాత్ర‌ల్లో మాత్రం ఈ ఇద్ద‌రు ఏ సినిమాలోనూ క‌నిపించ‌లేదు.    

అయితే `ఆచార్య‌`లో మాత్రం చ‌ర‌ణ్ తొలిసారి కీల‌క అతిథి పాత్ర‌కు మించిన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇదే ఇప్ప‌డు మెగా అభిమానుల్ని ఎక్జైట్ చేస్తోంది. ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ చిత్రంలో చ‌ర‌ణ్ పాత్ర ప‌వ‌ర్ ఫుల్ గా వుంటుంద‌ని, సినిమాలో 25 నిమిషాల పాటు సాగుతుంద‌ని, అంతే కాకుండా అవినీతిపై చేసే స‌మ‌రంలో చ‌ర‌ణ్ పాత్ర మ‌ద్య‌లోనే ఎండ్ అవుతుంద‌ని, ఆ పాత్ర ల‌క్ష్యాన్ని నెర‌వేర్చ‌డం కోసం ఆచార్య ఏం చేశాడ‌న్న‌దే ఈ చిత్ర ప్ర‌ధాన క‌థ అని తెలుస్తోంది. ఇప్ప‌టికే బ‌య‌టికి వ‌చ్చిన స్టోరీ కార‌ణంగా అభిమానులు ఏప్రిల్ 29 ఎప్పుడొస్తుందా? ఇద్ద‌రు స్టార్ ల‌ని క‌లిపి వెండితెర‌పై ఎప్పుడెప్పుడు చూసేయాలా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.
Tags:    

Similar News