రామోజీ కూడా ఒక బ్యాక్‌బోన్‌...

Update: 2015-07-02 17:45 GMT
ప్రస్తుతం ఇంటా బైటా ఒకటే చర్చ. బాహుబలి చిత్రానికి మీడియా దిగ్గజం రామోజీ చేస్తున్న ప్రచారం వెనక బోలెడన్ని లెక్కలున్నాయనే విషయంపైనే ఈ ఫోకస్‌ అంతా. ఆయన ఈ చిత్రానికి మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలవడమే గాకుండా భారీగా పెట్టుబడులు పెట్టారనేది ఓ వాదన. ఫిలింసిటీలో చిత్రీకరణకు అవసరమైన అన్ని వసతులు సమకూర్చడమే కాకుండా అవసరమైన ఆర్థిక బలాన్ని అందించారట.

అందుకే రెండేళ్ల పాటు సుదీర్ఘంగా చిత్రీకరించిన ఈ సినిమా ఎలాంటి ఫైనాన్సియల్‌ క్రైసిస్‌ లేకుండా బైటపడగలిగింది అనేది టాక్‌. కాని ఇందులో నిజముందా? లేదా? రామోజీ అకుంఠిత ధీక్ష వల్లే బాహుబలి అనుకున్న సమయంలోనే పూర్తయింది. పైగా భారీగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ కూడా చేయించగలిగారని ఇండస్ట్రీ జనాలు ఫ్లూట్‌ ఊదేస్తున్నారు. ఆర్కామీడియా సంస్థ, రాజమౌళి, రామోజీరావు ఈ మూడు బలాలు ఇలాంటి ఓ అసాధారణ సినిమా తెరకెక్కడానికి కారణం అని అందరికీ అర్థమవుతోంది. కాకపోతే రామోజీ కనుక ప్రొడ్యూసర్‌ అయ్యుంటే మరి సినిమా పోస్టర్ల మీద ఆయన పేరు ఎందుకు వెయ్యట్లేదు?

ఈ మధ్య ఈనాడు, ఈటీవీలో బాహుబలికి చేస్తున్న ప్రచారం చూస్తుంటే ఇప్పటివరకు రామోజీ తన సొంత సినిమాలకు కూడా చేయనంత పబ్లిసిటీ చేస్తున్నారు.. బాహుబలికి ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో విపరీతమైన ప్రచారం వచ్చేసింది. నిత్యం ఈనాడులో బాహుబలి కోసం ప్రత్యేకించి కథనాలు వెలువరించి ఓ చారిత్రక సినిమాకి ఇవ్వాల్సినంతా సపోర్ట్‌ ఇస్తున్నారేమోలే. ఏదేమైనా బాహబులికి రామోజీ కూడా ఒక బ్యాక్‌బోన్‌ అనాల్సిందే.

Tags:    

Similar News