తెలుగు సినీ.. రాజకీయ వర్గాల్లో ఇప్పుడో ఆసక్తికర అంశం హాట్ టాపిక్ గా మారింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలిసారి ఒక తెలుగు సినిమాకు జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు సాధించటం తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంపై ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. తెలుగులో అత్యుత్తమ చిత్రాలు నిర్మించినా.. వాటిని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లి.. వాటిని ప్రమోట్ చేసే పని ఇప్పటివరకూ ఎవరూ పెట్టలేదు. మధ్యలో కొందరు ప్రయత్నించినా.. పెద్దగా వర్క్ వుట్ కాలేదు.
కానీ.. బాహుబలి వ్యవహరం వేరు. జాతీయ స్థాయిలో ఈ చిత్రం ఒక సంచలనంగా మారటమే కాదు.. తెలుగు సినిమా గురించి బాలీవుడ్ సైతం ఆసక్తిగా చూసేలా చేసిన ఘనత రాజమౌళిదే. తన సినిమాతో తెలుగు సినిమా స్టామినాను భారీగా పెంచేసిన జక్కన్న ప్రయత్నం మీడియా మొఘల్ రామోజీరావును విపరీతంగా ఆకర్షించిందని చెబుతారు. మీడియా ప్రముఖుడిగా పేరున్న రామోజీకి.. జర్నలిజమే కాదు.. తెలుగు సినిమా అంటే కూడా విపరీతమైన ఆసక్తి. తన ఆసక్తికి తగ్గట్లు ఆయన కొన్ని ప్రయత్నాలు చేశారు కూడా. అయితే.. వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలతో సినిమా నిర్మాణం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి సమయంలోనే బాహుబలి ప్రాజెక్టు ఆయన దృష్టికి వెళ్లటం.. ఆ ప్రాజెక్టు ఆయనకు విపరీతంగా నచ్చటం.. ఓకే అనటం జరిగిపోయాయి. అలా.. బాహుబలికి రామోజీ కొండంత అండగా ఉండటం సినిమా రిలీజ్ సమయంలో ఆసక్తికర వార్తగా మారింది.
సినిమా విడుదలకు ముందు రామోజీ ఎంత సపోర్ట్ చేశారో.. ఆ తర్వాత కూడా కంటిన్యూ చేసినట్లుగా చెబుతున్నారు. వసూళ్ల ప్రచారాన్ని వార్తలుగా వేయని తీరుకు భిన్నంగా రామోజీ మీడియా బాహుబలి విషయంలో అందుకు భిన్నంగా వ్యవహరించటం అప్పట్లో ఆసక్తికరంగా మారటమే కాదు.. చిత్రపరిశ్రమలో చర్చగా మారింది.
ఇలా తనకు చేతనైనంత సాయాన్ని అందించేందుకు బాహుబలి విషయంలో రామోజీ ఏ మాత్రం తగ్గలేదని చెబుతారు. బాహుబలి సాధించిన విజయానికి మరింత తోడ్పాటు అందించేందుకు సాయం చేశారన్నది టాక్. అంతేకాదు.. జాతీయ అవార్డుకు ఎంపికైన విషయన్ని తనకున్న సోర్స్ ద్వారా రామోజీకి ముందే తెలిసిందని చెబుతున్నారు.
ఇందులో నిజానిజాల మాట ఎలా ఉన్నా.. రామోజీ రేంజ్ కి ఇలాంటి విషయాలు ముందే తెలియటం పెద్ద విషయమేమీ కాదు. అయితే.. తనకు తెలిసిన సమాచారాన్ని ఆయన జక్కన్నతో షేర్ చేసుకొని అభినందించారని చెబుతున్నారు. తెలుగు చలనచిత్రసీమలో ఇప్పటివరకూ సాధించలేని ఒక రికార్డు సాధించిన సందర్భాన్ని ముందే తెలుసుకోవటం ఒక ఎత్తు అయితే.. ఆ క్రెడిట్ దక్కాల్సిన వ్యక్తికి ముందే కంగ్రాట్స్ చెప్పటం ద్వారా రాజమౌళిని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేసినట్లుగా చెబుతున్నారు. ఈ విషయాల్లో నిజం ఎంతన్నది పక్కన పెడితే.. అలాంటి అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు.
మరోవైపు బాహుబలి పార్ట్ -1 కూడా కాదు కేవలం బిగినింగ్. ఆ సినిమా అందరిలో నాని ... బాగా నచ్చినా సినిమా సూత్రాలు పరంగా చూసినపుడు క్రిటిక్స్ తో పూర్తిగా మార్కులు తెచ్చుకోలేదన్న ఆరోపణ ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు అవార్డు రావడం వెనుక మోడీతో పాటు ఇంకొందరి స్వార్థం పక్షపాతం ఉన్నా ఆశ్చర్యం లేదంటున్నారు. అయితే, ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఎలా చూసినా ఈ సినిమాకు ఆ అర్హత అయితే ఉందని అంగీకరించాల్సిందే.