సీనియర్ నటీమణి రమ్యకృష్ణ ఎట్టకేలకు రీఎంట్రీని ఘనంగా చాటుకుంటోంది. అప్పట్లో నీలాంబరి. ఇక ఇప్పుడు బాహుబలిలో శివగామి అంటూ ఇంటా బైటా ప్రచారం సాగుతోంది. ఈ పవర్‌ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ నటన పీక్స్‌లో ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదండోయ్ రమ్యకృష్ణ ఈ క్యారెక్టర్‌తోనే వదిలిపెట్టడం లేదు.
ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రామినెంట్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. తను పూర్తి స్థాయిలో నటించడానికి రెడీ. ఎవరైనా ఛాలెంజింగ్ పాత్రల్ని క్రియేట్ చేసి వాటిలో నటించాల్సిందిగా కోరితే తప్పకుండా చేయడానికి ముందుకొస్తున్నారు. అదే తరహాలో ఇటీవలే కృష్ణవంశీ శిష్యుడు మనోజ్ రమ్యకృష్ణని కలిసి 'లొల్లి' అనే ఓ కథ చెప్పాడు. అంతేనా ఈ లొల్లిలో మీరే ప్రొఫెసర్. కాలేజీ లవ్‌స్టోరీలో మీదే కీరోల్.. అంటూ ఎంపిక చేసుకున్నాడు.
కథ, తన పాత్ర నచ్చేసి వెంటనే రమ్య ఆంటీ ఓకే చెప్పేశారట. ఓ వైపు సంసార బాధ్యతల్లో లొల్లి చూసుకుంటూనే ఇలా ముఖానికి రంగేసుకుని లొల్లికి రెడీ అయిపోతున్నారు రమ్య. రెండు చోట్లా బాధ్యతల్ని సవ్యంగా నెరవేర్చే సత్తా తనకి ఉంది. మునుముందు రమ్య ఆంటీ మరిన్ని ఛాలెంజింగ్ పాత్రల్లో నటించాలని కోరుకుందాం.