మద్రాస్ కేఫ్ తరహాలో కథ ఉండనుందా??

Update: 2017-12-26 17:21 GMT
ఒక్కోసారి మనోళ్ళు చూపించిన సినిమాలనే మళ్ళీ మళ్ళీ చూపిస్తుంటారు. ఉదాహరణకు మనం సుభాష్‌ చంద్రబోస్ జీవితంపై ఇప్పటికే ఇండియాలో నాలుగు సినిమాలు.. రెండు టివి సిరీస్ లు చూశాం. వీటిలో కొన్ని రిలీజై ఆడలేదు.. కొన్ని రిలీజుకు నోచుకోకుండా టివిల్లో వచ్చేశాయి. అయితే ఇప్పుడు అలాంటి ఫీట్ తెలుగులో మరోసారి జరగనుందా అంటే అవుననే అనుకోవాలి.

మనం ఆల్రెడీ చెప్పినట్లు.. బాబాయ్ వెంకీ అబ్బాయ్ రానా కలసి ఒక వెబ్ సిరీస్ చేయడానికి సన్నద్దమవుతున్నారు. ఈ సినిమా కథాంశం ఏమనగా.. ఎల్.టి.టి.ఇ చేతిలో హత్యగావించబడిన దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసును ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్ డిఆర్ కార్తికేయన్ కథ అని తెలుస్తోంది. కార్తికేయన్ పాత్రలో వెంకీ కనిపిస్తే.. మరో ముఖ్య పాత్రలో రానా ఉంటాడట. అయితే ఇదే కథ నేపథ్యంలో.. హత్య జరిగాక జరిగిన పరిణామాలతోపాటు అసలు హత్యకు ముందు జరిగిన పరిణామాలను కలుపుతూ.. పలానా స్టోరీ అని చెప్పకుండా.. దర్శకుడు షూజిత్ సర్కార్ 'మద్రాస్ కేఫ్‌' సినిమాను తీశాడు. ఇప్పుడు వెంకీ-రానా వెబ్ సిరీస్ కూడా అదే తరహాలో ఉండే ఛాన్సుంది.

నిజానికి వెబ్ వరల్డ్ మనోళ్ళు తీసే వెబ్ సిరీస్ లు దాదాపు అన్నీ రొమాంటిక్ కామెడీలే ఉంటాయి. తక్కువ బడ్జెట్లో ఏదో ప్రయోగం చేస్తుంటారు. అయితే ఫారిన్ తరహాలో ఇలాంటి పెద్ద కెన్వాస్ కథలను ఎన్నుకోవడం ఇదే మొదటసారి. కాని ఈ రూమర్లో నిజమెంతో ఇంకా తెలియరాలేదు.
Tags:    

Similar News