రానా వచ్చే ఏడాదంతా ఫుల్‌ బిజీ

Update: 2018-11-06 03:30 GMT
యంగ్‌ హీరో రానా బాహుబలి చిత్రంలో విలన్‌ గా నటించిన తర్వాత ఒక్కసారిగా స్టార్‌ అయ్యాడు. తెలుగుతో పాటు తమిళం - హిందీల్లో కూడా రానా మంచి నటుడిగా పేరు తెచ్చుకుని దూసుకు పోతున్నాడు. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు నిర్మాణం - ఇంకో వైపు టాక్‌ షోకు హోస్ట్‌ గా చాలా బిజీగా గడుపుతున్నాడు. ఇక రానా వచ్చే ఏడాదికి కూడా ఫుల్‌ బిజీగా మారబోతున్నాడు. పలు చిత్రాలకు కమిట్‌ అయిన రానా ఆ చిత్రాలను వచ్చే ఏడాదిలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ముఖ్యంగా రానా - గుణశేఖర్‌ ల కాంబినేషన్‌ లో ఒక పౌరాణిక చిత్రం తెరకెక్కబోతుంది. ఈ ప్రాజెక్ట్‌ గురించి చాలా నెలలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆ చిత్రాన్ని సురేష్‌ బాబు మరియు గుణశేఖర్‌ లు సంయుక్తంగా నిర్మించేందుకు సిద్దం అవుతున్నారు. దాదాపు 60 కోట్ల బడ్జెట్‌ తో ఆ పౌరాణిక చిత్రం తెరకెక్కబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఆ చిత్రంలో హిరణ్య కశ్యపుడి పాత్రలో రానా కనిపిస్తాడని తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని పట్టాలెక్కించే గుణశేఖర్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

గుణశేఖర్‌ దర్శకత్వంలో సినిమా మాత్రమే కాకుండా తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘96’ చిత్రం రీమేక్‌ లో కూడా రానా నటించే అవకాశాలున్నాయంటూ సమాచారం అందుతుంది. 96 చిత్ర రైట్స్‌ ను దిల్‌ రాజు చేజిక్కించుకున్న విషయం తెల్సిందే. రానా ఆ రీమేక్‌ పై ఆసక్తిగా ఉన్నాడట. ఆ తర్వాత వేణు ఉడుగుల దర్శకత్వంలో కూడా రానా ఒక చిత్రాన్ని చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ఈ మూడు సినిమాలతో పాటు మరి కొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. మొత్తానికి వచ్చే ఏడాదిలో రానా చాలా బిజీ కాబోతున్నాడు.
Tags:    

Similar News