బాహుబలి మూవీతో దగ్గుబాటి రాణాకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఆయన కేవలం తెలుగు సినిమాలకు పరిమితం కాదు. బాహుబలి, ఘాజీ సినిమాలతో తెలుగు, హిందీ, తమిళం భాషల్లో కూడా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇపుడు రాణా నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఉన్న బహుభాషా నటుడు. హిందీ - తమిళంలో కూడా రాణా నటిస్తున్నాడు. దీంతో,రాణా ఏ భాషలో సినిమా చేసినా ఇతర భాషల్లోకి అనువాదం అవుతున్నాయి.
కొంతకాలం క్రితం రాణా నటించిన 'ఘాజీ' సినిమా మూడు భాషల్లో విడుదలై మంచి విజయం సాధించింది. త్వరలో విడుదల కానున్న రాణా కొత్త సినిమా 'నేనే రాజు నేనే మంత్రి' కూడా మూడు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రం మొదలైనపుడు తెలుగు సినిమానే కానీ.. విడుదల సమయానికి త్రిభాషా చిత్రం అయిపోయింది. తమిళం.. హిందీలోనూ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
తమిళంలో ఈ చిత్రానికి వెరైటీ టైటిల్ ఖరారు చేసి ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. 'నాన్ ఆనయిట్టాల్' అనే పేరును తమిళ వెర్షన్‌కు కన్ ఫర్మ్ చేశారు. తమిళుల ఆరాధ్య దైవం ఎంజీఆర్ సినిమాలో సూపర్ హిట్ పాట పల్లవి 'నాన్ ఆనయిట్టాల్' మాటతో మొదలవుతుంది. ఆ పాట తమిళంలో సూపర్ పాపులర్. నాన్ ఆనయిట్టాల్.. అంటే 'నేను ఆదేశిస్తే' అని అర్థం. ఈ మాట తమిళ జనాలకు చాలా ఈజీగా కనెక్టవుతుందనే ఉద్దేశంతో ఈ టైటిల్ ను ఫిక్స్ చేశారట.
ఎంజీఆర్ పాటలో పదాన్ని టైటిల్ గా ఎంచుకోవడం రాణాకు కలిసొచ్చే అంశం. ఇక ఈ చిత్రంలో కాజల్, కేథరిన్ కథానాయికలుగా నటిస్తుండడంతో ఈ చిత్రానికి తమిళ ప్రేక్షకులు మరింత కనెక్టవుతారనడంలో సందేహం లేదు. రాణా తండ్రి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మీద మంచి ప్రేక్షకులకు మంచి అంచనాలే ఉన్నాయి.