రానా దగ్గుబాటి సోలో హీరోగా తెలుగులో మంచి విజయాన్నందించిన చిత్రం ‘నేను రాజు నేనే మంత్రి’. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. దాన్ని తట్టుకుని మంచి వసూళ్లే రాబట్టింది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి రిలీజ్ చేయాలని చూశారు కానీ.. కుదర్లేదు. దీంతో ముందు ఆగస్టు 11న తెలుగులో రిలీజ్ చేసేసి.. ఇప్పుడు తమిళంలో విడుదల చేశారు. ‘నాన్ ఆనయిటాల్’ పేరుతో శుక్రవారమే తమిళ ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. ‘బాహుబలి’.. ‘ఘాజీ’ సినిమాలతో రానా తమిళ ప్రేక్షకులకు చేరువైనా.. కాజల్ అగర్వాల్ కూడా అక్కడి వాళ్లకు బాగానే పరిచయమున్నా.. ఈ సినిమాను అక్కడి జనాలు పెద్దగా పట్టించుకోలేదు.
ఈ శుక్రవారం తమిళంలో రానా సినిమాకు పోటీగా ఏకంగా తొమ్మిది సినిమాలు రిలీజయ్యాయి. గత వారం పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో తెలుగులో క్లియరెన్స్ సేల్ టైపులో ఐదు సినిమాలు రిలీజ్ చేసినట్లే.. తమిళనాట కూడా ఈ వీకెండ్లో మొత్తం తొమ్మిది సినిమాలు రిలీజయ్యాయి. అన్ని సినిమాల మధ్య ఓ డబ్బింగ్ సినిమాను ఏం పట్టించుకుంటారు? తెలుగులో మాదిరి అక్కడ పెద్దగా ప్రమోషన్ కూడా చేయలేదు. థియేటర్లు కూడా చాలా తక్కువే ఇచ్చారు. తమిళ క్రిటిక్స్ కూడా ఈ సినిమాను పట్టించుకోలేదు. రివ్యూలు కూడా ఇవ్వలేదు. జనాల్లో ఈ సినిమా గురించి డిస్కషనే లేదు. దీంతో తమిళంలోనూ వసూళ్లు కొల్లగొడదామని చూసిన రానాకు నిరాశ తప్పేలా లేదు.