రానా ఇంటర్వ్యూలు.. రప్పిస్తాయా?

Update: 2017-12-12 05:18 GMT
అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ కు మళ్లీ ఇన్నాళ్లకు ఓ సినిమాకు మంచి టాక్ వచ్చింది. 10 ఏళ్ల క్రితం మధుమాసం చిత్రం తర్వాత.. సుమంత్ చిత్రానికి మంచి టాక్ రావడం ఇదే మొదటిసారి. అలాగని ఈ దశాబ్దంలో పట్టుమని 10 సినిమాలు కూడా చేయలేదు ఈ హీరో. బాగా సెలెక్టివ్ గా మూవీస్ చేస్తూ కెరీర్ ని కంటిన్యూ చేస్తున్నాడు.

రీసెంట్ రిలీజ్ మళ్లీ రావా చిత్రానికి ఆడియన్స్ నుంచి స్పందన బాగుంది. సుమంత్ ట్రాక్ రికార్డ్ కారణంగా.. తక్కువ థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీని ఎలాగైనా సేఫ్ జోన్ లోకి తీసుకు రావాలని ఫిక్స్ అయ్యాడు సుమంత్. అందుకే రిలీజ్ తర్వాత కూడా ప్రమోషన్స్ బాగానే చేస్తున్నాడు. సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు ఇప్పుడు  ట్రెండ్. అందుకే దగ్గుబాటి రానాతో మళ్లీ రావా హీరో-హీరోయిన్స్ అయిన సుమంత్- ఆకాంక్ష సింగ్ ఇంటర్వ్యూ చేయించి.. ప్రమోట్ చేస్తున్నారు.

బాహుబలి2.. నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో మంచి స్టార్ డం సంపాదించుకున్నాడు రానా. అలాగే నెంబర్ 1 యారీ వంటి టీవీ ప్రోగ్రామ్స్ తో జనాలకు దగ్గరయ్యాడు. ఇప్పుడు రానా ఇంటర్వ్యూలు మళ్లీ రావా మూవీకి ఏ మాత్రం ఉపయోగపడతాయో చూడాలి. అయితే.. టాక్ బాగుండడం.. ప్రమోషన్స్ పై గ్రిప్ కంటిన్యూ చేస్తుండడంతో.. మళ్లీ రావా చిత్రం హిట్ అనిపించుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ జనాలు అంటున్నారు.


Tags:    

Similar News