ష్‌...! రానా పెళ్లిలో ఆ న‌లుగురు!!

Update: 2020-08-07 04:45 GMT
ద‌గ్గుబాటి వెడ్డింగుకి స‌మ‌య‌మాస‌న్న‌మైంది. రానా దగ్గుబాటి - మిహీకా బజాజ్ జంట ఈనెల 8న వివాహానికి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. కొద్ది మంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో ఈ వివాహం జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో పెళ్లి వేదిక‌ను రెడీ చేస్తున్నార‌ని తెలుస్తోంది. గ‌త వారం రోజులుగా ద‌గ్గుబాటి కాంపౌండ్ లో పెళ్లి సంద‌డికి సంబంధించిన ప్ర‌తిదీ అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతూనే ఉంది.

ఇప్ప‌టికే హ‌ల్దీ వేడుక‌కు సంబంధించిన హ‌డావుడి చూస్తున్న‌దే. తాజా స‌మాచారం ప్ర‌కారం.. రానా పెళ్లి వేదిక మారే వీల్లేద‌ని తెలిసింది. కోవిడ్ నియ‌మ‌నిబంధ‌న‌ల‌తో రామానాయుడు స్టూడియోస్ లో నే ఎంతో ప‌క‌డ్భందీగా ఈ వివాహానికి ఏర్పాట్ల‌న్నీ చేశారట‌. స్టూడియోలోనే పెళ్లి స‌హా ఈ రెండ్రోజుల సంబ‌రాలు జ‌ర‌గ‌నున్నాయి.

కోవిడ్ -19 ఆంక్షల న‌డుమ రానా తండ్రి గారైన సురేష్ బాబు ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నార‌ట‌. ఇరు కుటుంబ స‌భ్యులు.. బంధుమిత్రులు క‌లుపుకుని దాదాపు 50 మంది వ‌ర‌కూ హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంద‌ట‌. ఇందులో ఆ న‌లుగురు ఉంటార‌ని స‌మాచారం. ఆ న‌లుగురు అంటే ఎవ‌రు? అంటే..  అదే స‌స్పెన్స్.

ఆ న‌లుగురిలో ఒక పెళ్లైన జంట ఉంటుంది. ఆ జంట ఎవ‌రో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నే లేదు. రానా క‌జిన్స్‌ నాగ‌చైత‌న్య - స‌మంత జోడీ త‌ప్ప‌నిస‌రి. అలాగే రానాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన రామ్ చ‌ర‌ణ్ - బ‌న్ని అటెండ‌య్యే ఛాన్సుంద‌ట‌. అలాగే డార్లింగ్ ప్ర‌భాస్ నిన్న ఖైర‌తాబాద్ లోనే హ‌ల్ చ‌ల్ చేశారు కాబ‌ట్టి సిటీ దాటి బ‌య‌టికి వెళ్ల‌లేదు. భ‌ళ్లాలుని పెళ్లికి బాహుబ‌లి లేక‌పోతే ఎలా? అందుకే ప్ర‌భాస్ త‌ప్ప‌నిస‌రిగా ఎటెండ‌వుతాడ‌ని భావిస్తున్నారు. ఇక వీళ్ల‌తో పాటే శ‌ర్వానంద్ - వ‌రుణ్ తేజ్ కూడా అటెండ‌య్యే వీలుంద‌ని భావిస్తున్నారు. ఇక పెళ్లికి ముందు బ్యాచిల‌ర్స్ పార్టీ ఇవ్వ‌కుండా ఉంటాడా?
Tags:    

Similar News