బాలయ్యకు కలిసొస్తున్న హీరోయిన్..!
నందమూరి బాలకృష్ణ తో ప్రస్తుతం 3 సినిమాలు నటించి తన క్రేజ్ చాటేలా చేస్తుంది ప్రగ్యా జైశ్వాల్.
నందమూరి బాలకృష్ణ తో ప్రస్తుతం 3 సినిమాలు నటించి తన క్రేజ్ చాటేలా చేస్తుంది ప్రగ్యా జైశ్వాల్. బాలయ్యతో అఖండ సినిమాలో నటించిన అమ్మడు ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆఫర్లు పెద్దగా రాబట్టలేదు కానీ మర్చిపోకుండా చేసుకుంది. ఐతే అఖండ సీక్వల్ లో మళ్లీ ప్రగ్యానే కథానాయికగా ఎంపిక చేశారు. క్రేజీ సీక్వల్ లో నటించడం పట్ల చాలా సంతోషంగా ఉంది ప్రగ్యా జైశ్వాల్. ఐతే అఖండ, అఖండ 2నే కాదు సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజ్ సినిమాలో కూడా ప్రగ్యా నటించింది.
డాకు మహారాజ్ లో ప్రగ్యా జైశ్వాల్ నిజంగానే ఆడియన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది. సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వై రౌతెలా ఉన్నారని తెలుసు కానీ ప్రగ్యా జైశ్వాల్ కూడా ఉందని ఎవరు ఊహించలేదు. ట్రైలర్ లో ప్రగ్యా ని చూసి ప్రేక్షకులు సర్ ప్రైజ్ అయ్యారు. ఐతే బాలయ్య సినిమాకు ఆమె లక్కీగా మారుతుందని చెప్పొచ్చు. అఖండ లో కలిసి నటించడం వల్ల అది సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు రాబోతున్న డాకు మహారాజ్ కూడా బజ్ చూస్తుంటే పక్కా హిట్ అనేలా ఉంది.
ఐతే డాకు మహారాజ్ లో తన సెలక్షన్ అంతా డైరెక్టర్ బాబీ చేతుల్లోనే ఉందని అన్నది ప్రగ్యా జైశ్వాల్. సినిమాలో నటించడం కోసం తనకు కాల్ వస్తే చాలా సర్ ప్రైజ్ గా ఫీలయ్యా అన్నది ప్రగ్యా జైశ్వాల్. ఐతే డాకు మహారాజ్ హిట్ పడితే ఎలాగు అఖండ 2 మీద భారీ హైప్ ఉంది కాబట్టి అది ఎలా ఉన్నా సక్సెస్ అందుకునే ఛాన్స్ ఉంటుంది. బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్ హిట్ పెయిర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఐతే బాలయ్య సినిమాలు తప్ప ప్రగ్యాకి మిగతా ఆఫర్లు రావట్లేదు.
బాలకృష్ణకు మాత్రం ఆమె పర్ఫెక్ట్ జోడీ అనిపిస్తుంది. కెరీర్ కాస్త అటు ఇటుగా ఉన్నా ప్రగ్యా జైశ్వాల్ తనకు వచ్చిన అవకాశాలను చేస్తూ వస్తుంది. ఐతే ఆమె బాలయ్య సినిమాల్లో ఆఫర్ రావడం సంతోషాన్ని వ్యక్త పరుస్తుంది. డాకు మహారాజ్ హిట్ పడితే ప్రగ్యాకి వేరే సినిమాల ఆఫర్లు కూడా రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఏది ఏమైనా ప్రగ్యా ని మన డైరెక్టర్స్ సరిగా వాడుకోవట్లేదు అన్నది ఇన్నర్ టాక్. మరి అమ్మడి ఫేట్ రాబోయే సినిమాతో అయినా మారుతుందేమో చూడాలి.