క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ తాజా ప్రయత్నం రంగ మార్తాండ. ప్రకాష్ రాజ్..రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం ప్రారంభించినా రకరకాల కారణాలతో ఆలస్యమైంది. మరాఠీ చిత్రం `నట సామ్రాట్` కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. రెండేళ్ల క్రితమే తెలుగు వెర్షన్ షూటింగ్ ప్రారంభమైంది. అయితే అటుపై కరోనా రాకతో `రంగ మార్తాండ` అప్ డేట్ కూడా కరువైంది. రంగ మార్తాండకు ముందు..వెనుక ప్రారంభమైన సినిమాలు ఓటీటీల్లోనూ.. కుదిరిన వాళ్లు థియేటర్లలలోన రిలీజ్ కి ప్లాన్ చేశారు.
కానీ `రంగ మార్తాండ`కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ని కృష్ణ వంశీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సినిమా ఆగిపోయిందా? అన్న సందేహాలు ఒకానొక దశలో వ్యక్తం అయ్యాయి. కోవిడ్ రాకతో ఆర్ధిక సంక్షోభం ఏర్పడటంతో చాలా చిన్న చిత్రాలు షూటింగ్ మధ్యలో ఆగిపోయాయి. మరికొన్ని చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ ల్లోనూ నిలిచిపోయాయి. బ్యాంకులు మారోటోరియం విధించడం.. అప్పులివ్వడం మానేసాయి. దీంతో మళ్లీ డబ్బు కూడగట్టిన తర్వాత వాటి సంగతి చద్దాంలే అంటూ చాలా మంది చిన్న నిర్మాతలు ఎక్కడ సినిమాలు అక్కడ ఆపేసారు. ఆ రకంగా `రంగ మార్తాండ` కూడా ఇబ్బంది పడిందనే సంకేతాలు కనిపించాయి.
ఈ చిత్రం ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటోందని..ఆ కారణంగానే సినిమా ఆగిపోయింది అని కథనాలు వెలువడ్డాయి. అయితే తాజాగా కృష్ణవంశీ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. అన్ని పనులు పూర్తి చేసిన డిసెంబర్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అంటే ఈ లోపు బ్యాలెన్స్ పనులు పూర్తిచేయనున్నట్లు తెలుస్తోంది. ప్యాచ్ వర్క్...పోస్ట్ ప్రొడక్షన్ పనులు నెల రోజుల్లో పూర్తిచేసిన అటుపై యూనిట్ ప్రచారంలో బిజీ కానున్నట్లు సమాచారం అందుతోంది. రంగ మార్తాండలో ఇంకా బ్రహ్మానందం...అలీ.. రాహుల్ సిప్లింగజ్..శివాత్మిక రాజశేఖర్..అనసూయ నటిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
రైతు స్క్రిప్టు సంగతేంటో..!
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ ఇటీవల చాలా కాలంగా రేసులో వెనకబడిన సంగతి తెలిసిందే. సింధూరం- నిన్నే పెళ్లాడుతా-ఖడ్గం-చందమామ- మురారి లాంటి క్లాసిక్స్ ని తెరకెక్కించిన కృష్ణవంశీ ఆ తర్వాత ఎందుకనో ఆ స్థాయి క్వాలిటీ ప్రొడక్ట్ ని ఇవ్వడంలో తడబడ్డారు. రామ్ చరణ్ `గోవిందుడు అందరివాడేలే` చిత్రంతో కంబ్యాక్ అవ్వాలన్న ప్రయత్నం కూడా విఫలమైంది. ప్రస్తుతం అతడు కొంత గ్యాప్ తర్వాత మరాఠీ చిత్రం నటసామ్రాట్ అధికారిక రీమేక్ `రంగ మార్తాండ`ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత నెక్ట్స్ ఏంటి? అన్న డైలమా నుంచి అతడు బయటపడలేకపోతున్నారు. చాలా కాలంగా రైతు అనే స్క్రిప్టును రెడీ చేసుకుని అతడు స్టార్ హీరోల వెంట పడుతున్నా ఏదీ వర్కవుట్ కావడం లేదు. ఇప్పటికే బాలకృష్ణకు స్క్రిప్టు నచ్చిందని కూడా ప్రచారమైంది. కానీ అదీ వర్కవుట్ అవ్వలేదు. బాలయ్య ఇతర దర్శకులకు కమిట్ మెంట్లు ఇచ్చేశారు.
ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి ఈ స్క్రిప్టును వినిపించాలనే ఆలోచనతో క్రియేటివ్ డైరెక్టర్ ఉన్నారని ప్రచారమైంది. అయితే తేదీల లభ్యత అంత సులువేమీ కాదని గ్రహించిన కృష్ణవంశీ కాల్షీట్ల గురించి ఆరా తీసేందుకు ఎన్టీఆర్ బృందాన్ని సంప్రదించారన్న టాక్ వచ్చింది. తారక్ తో కృష్ణవంశీకి చక్కని అనుబంధం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ - కృష్ణ వంశీ ఇద్దరూ గతంలో రాఖీ(2006) సినిమా కోసం పనిచేశారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. ఆ తర్వాత మళ్లీ ఆ కాంబినేషన్ కుదరలేదు. ఇప్పుడు కృష్ణ వంశీ రైతు స్క్రిప్ట్ మీద మరోసారి రీవర్క్ చేస్తున్నారట. బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేని.. అనీల్ రావిపూడి వంటి డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు. తదుపరి తనయుడి ఎంట్రీ మూవీ ఆదిత్య 369 సీక్వెల్ పై దృష్టిసారిస్తారు. ఇలాంటి టైమ్ లో కృష్ణవంశీకి చిక్కడం అంత సులువేమీ కాదు. అందుకే అతడు తారక్ కానీ ఎవరైనా స్టార్ హీరో అయినా కానీ రైతు స్క్రిప్టుకి ఓకే చెబుతారనే హోప్ తో ఉన్నారని కథనాలొచ్చాయి.
క్రియేటివిటీ ఈసారైనా వర్కవుటయ్యేనా?
కృష్ణవంశీ తెరకెక్కించిన మహాత్మ- పైసా లాంటి చిత్రాలు కీలక సమయంలో బోల్తా కొట్టడం కూడా అతడి కెరీర్ కి పెద్ద మైనస్ అయ్యింది. మహాత్మకు అవార్డులొచ్చినా డబ్బులు రాలేదు. నాని లాంటి హీరోతో పైసా చిత్రం చేసినా అది చెత్త సినిమాగా నిలిచింది. ఏ సినిమా చేసినా కృష్ణవంశీ తన మార్క్ ని మిస్సయ్యారన్న విమర్శలొచ్చాయి. అందుకే అతడు తిరిగి కంబ్యాక్ అయ్యేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. రంగ మార్తాండ ఇలాంటి ప్రయత్నమే. ఏది ఏమైనా రంగమార్తాండ కీలక సినిమా. ఇందులో రమ్యకృష్ణ సహా గొప్ప నటీనటులు ఉన్నారు. ఈ చిత్రం బ్రేక్ ఇస్తేనే కానీ.. తదుపరి అవకాశాలకు దారి లభించదని విశ్లేషిస్తున్నారు.