ఇండస్ట్రీ పెద్దలు.. నటవారసులు అంటే అంతెత్తున ఎగిరిపడే కంగన - రంగోలి సిస్టర్స్ నోరు జారుడు వ్యవహారం గురించి తెలిసిందే. ప్రత్యర్థుల చెవులకు చిల్లులు పడే టెక్నిక్ ని రంగోలిని చూసి నేర్చుకోవాల్సిందే. రాకేష్ రోషన్- హృతిక్ రోషన్ తో గిల్లికజ్జాలు.. అటుపై భట్స్- కరణ్ జోహార్ క్యాంప్ పై ఫైరింగ్ వ్యవహారం మొదలు ఎందరో పెద్ద మనుషులతో పోరాటం సాగిస్తున్న సదరు సిస్టర్స్ తాజాగా మరోసారి నోరు పారేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
ఆస్కార్ నామినేషన్లలో కంగన నటించిన మణికర్ణిక చిత్రాన్ని ఎంపిక చేయలేదని ఫైరైన రంగోలి .. అసలు ఒక కాపీ చిత్రాన్ని ఆస్కార్ కి ఇండియా తరపున పంపిస్తారా? అంటూ తీవ్ర విమర్శలు చేసింది. గల్లీ బోయ్ చిత్రాన్ని తెరకెక్కించిన జోయా అక్తర్ బృందాన్ని తిట్టేసింది. ఇక గల్లీబోయ్స్ నాయిక.. ఆలియాపైనా తన కక్షను మరోసారి బయటపెట్టింది రంగోలి.
ఈ వివాదం సద్ధుమణిగే లోగానే మరోసారి ట్విట్టర్ లో తిట్ల పురాణం అందుకుంది. బాలీవుడ్ లో చిల్లర మనుషులే ఎక్కువ. ఎవరైతే నోరు తెరిచి అరుస్తారో వాళ్లంతా చిల్లర బ్యాచ్ అంటూ మరోసారి తనదైన శైలిలో నోటికి పని చెప్పింది రంగోలి చందేల్. ``నోరు తెరిస్తే చాలు.. అన్నీ ఆటంకాలు... హింస.. అనర్థాలే.. దుష్టత్వాన్ని ఎంకరేజ్ చేసేలానే ఉంటారు ఇక్కడ పెద్ద మనుషులు. అందుకే కంగన తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడతాను`` అని ఫైరైంది.