దీపిక కోసం ఆ అభిమాని అంత పని చేశాడట!

Update: 2020-01-05 10:50 GMT
సెలబ్రిటీలకు బోలెడంత మంది అభిమానులు ఉండటం.. వారి కోసం దేనికైనా రెఢీ అన్నట్లు వ్యవహరించటం మామూలే. కొందరు ఫ్యాన్స్ చేసే పనితో సెలబ్రిటీలు చేదు అనుభవాలు ఎదురైతే.. మరికొందరు ఫ్యాన్స్ కారణంగా విపరీతమైన ఆనందానికి గురవుతుంటారు. తాజాగా బాలీవుడ్ సుందరాంగి దీపికా పదుకునేకు తాజాగా సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు అభినందనలు తెలియజేయటం కోసం రాత్రంతా ఎయిర్ పోర్టులో ఎదురుచూసిన ఫ్యాన్ గురించి తెలిసిన ఆమె ఆశ్చర్యానికి గురై.. ఫిదా అయ్యారు.  దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వైరల్ గా మారింది. బాలీవుడ్ ఫోటో గ్రాఫర్ మానవ్ మంగ్లానీ షేర్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.

భర్త రణవీర్ సింగ్ తో కలిసి లక్నో నుంచి ముంబయి ఎయిర్ పోర్టుకు వచ్చారు దీపికా. ఆమె రాక కోసం పలువురు ఫోటోగ్రాఫర్లు వెయిట్ చేస్తున్నారు. వారంతా ఆమె ఫోటోల్ని తీసుకుంటుండగా.. ఒక వ్యక్తి వారి మధ్య నుంచి వచ్చి కేక్ ముందు ఉంచారు. దీంతో.. ఆమె అవాక్కు అయ్యారు.

అక్కడున్న ఫోటో గ్రాఫర్లు కొందరు.. అతను ఆమెకు వీరాభిమాని అని.. ఆమె వస్తుందన్న విషయాన్ని తెలుసుకొని రాత్రంతా ఎయిర్ పోర్టులోనే వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. దీంతో విపరీతమైన సంతోషానికి గురైన ఆమె.. కేక్ కట్ చేసి.. బర్త్ డే వేడుకల్ని చేసుకున్నారు. ఏమైనా.. ఈసారి బర్త్ డేను అమె ఇప్పట్లో మర్చిపోలేరేమో?

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News