త్రివిక్రమ్ వెళ్ళిపోమన్నా.. వెళ్ళలేం

Update: 2016-05-31 04:52 GMT
''అసలు త్రివిక్రమ్ గారి సినిమా షూటింగ్‌ అంటే.. ఆయన వెళ్ళిపోమన్నా కూడా మనం వెళ్ళలేం. షూటింగ్ లొకేషన్లో మన పని అయిపోయినా కూడా.. మనం ఆయనతో కూర్చొని కాఫీ తాగితే బాగుండు. కాస్త ఏదైనా టైమ్ స్పెండ్ చేస్తే బాగుండు.. అనిపిస్తుంది'' అని చెబుతున్నాడు విలక్షణ నటుడు రావు రమేష్. ఆయన ఇప్పటికే ''అ..ఆ'' సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నాడంట.

పిల్లలను శృతిమించిన గారాభం చేసే పల్లవ వెంకన్నఅనే క్యారెక్టర్‌ చేస్తున్నాడు రమేష్. అనుపమ పరమేశ్వరన్ ఈయన కూతురిగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన డైలాగులు వగైరా ట్రైలర్లలో అదరగొట్టేస్తున్నాయి. దీని గురించి చెబుతూ.. ''త్రివిక్రమ్‌ గారు ఎప్పుడూ ఒకటే చెబుతారు. 'రమేష్‌ గారు.. మీరు ఎక్కువగా నటిస్తే.. మన రావు గోపాలరావుగారి అబ్బాయే కదా.. ఎందుకు చేయడులే అంటారు. కాని తప్పు చేస్తే మాత్రం.. ఆయన పరువు తీశాడురా అంటారు.. జాగ్రత్త' అని చెబుతుంటారు. ఆయన దగ్గర అలాంటి చాలా విషయాలు నేను నేర్చుకున్నా. అందుకే ఈ సినిమాలో మాంచి ఔట్పుట్‌ వచ్చింది'' అంటున్నాడు గోపాలరావు గారి అబ్బాయి.

ఇకపోతే ఈ సినిమాలో మొదటి నుండి చివర వరకు కనిపించే పాత్రలో మెరుస్తున్నారు కాబట్టి.. రావు రమేష్ కెరియర్‌ కు ఇదే అతి పెద్ద టర్నింగ్‌ పాయింట్‌ అని సినిమా ఎనలిస్టులు కూడా అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. అ..ఆ జూన్ 2న రిలీజ్ అవుతోంది.
Tags:    

Similar News