యాంకర్లు.. స్టార్లు.. సింగర్లు ఇలా సెలబ్రిటీల్ని ఎవరినీ మహమ్మారీ వదిలి పెట్టడం లేదు. ఆన్ లొకేషన్ అంటిపెట్టుకుని తిరిగినా.. వృత్తిలో భాగంగా సహచరులతో రాసుకు పూసుకుని తిరిగినా అంతే సంగతి. ఇక పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయ్యేందుకు ఆస్కారం ఉన్నవారందరినీ వైరస్ వెంటాడేస్తోంది. తాజాగా ప్రముఖ ర్యాపర్ రాఫ్తార్ కోవిడ్ 19 పరీక్షలు చేయించుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే ల్యాబ్ రిపోర్ట్ రావాల్సి ఉందని ఇప్పటికి లక్షణాలేవీ కనిపించలేదని తనే స్వయంగా సోషల్ మీడియాల్లో ప్రకటించాడు.
రాఫ్తార్ పాపులర్ ర్యాపర్. తమంచె పె డిస్కో.. తు మేరా భాయ్ నహీ హై.. స్వాగ్ మేరా దేశీ వంటి పాటలతో గొప్పగా పాపులరయ్యాడు. మ్యూజిక్ కంపోజర్ గా రాఫ్తార్ సుపరిచితం. కోవిడ్ -19 పరీక్షలు చేసినట్లు బుధవారం ఇన్ స్టాలో ప్రకటించారు. ఇంట్లో తనను తాను వేరుపరిచాయనని తెలిపారు. MTV రియాలిటీ షో రోడీస్ షూట్ ప్రారంభించడానికి ముందు తనను తాను పరీక్షించుకున్న రాఫ్తార్ తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని అభిమానులను కోరాడు.
సాంకేతిక కారణాల వల్లనే రిపోర్ట్ ఆలస్యమైంది. ఈ రోజు వచ్చిన నా మూడవ పరీక్ష ఫలితం సానుకూలంగా ఉంది. బిఎమ్.సి నన్ను ఒంటరిగా ఉండమని కోరింది. అందువల్ల నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను అని తెలిపారు. నాకు ఎటువంటి లక్షణాలు లేవు. ఆరోగ్యంగా ఉన్నా విడిగా ఉండడం కర్తవ్యంగా భావించాను అని తెలిపారు.