నో ట్వీట్స్ ప్లీజ్‌..సోష‌ల్ మీడియాకు మ‌రో హీరోయిన్ బ్రేక్‌!

Update: 2022-09-06 17:30 GMT
విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన `లైగ‌ర్‌` ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే డిజాస్ట‌ర్ టాక్ ని సొంతం చేసుకుంది. పూరి జ‌గ‌న్నాథ్ అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించిన ఈ మూవీపై అటు పూరి, ఛార్మీ, హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఫ‌లితం మాత్రం డిజాస్ట‌ర్ అని తేలింది. దాదాపు మూడేళ్ల పాటు ప‌డిన క‌ష్టం వృధాకావ‌డంతో చిత్ర బృందం షాక్ కు గురైంది. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా చిత్ర బృందాన్ని నెటిజ‌న్ లు ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు.

`లైగ‌ర్‌` డిజాస్ట‌ర్ ట్రోల్స్‌ ని త‌ట్టుకోలేని ఛార్మీ తాను సోష‌ల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించి షాకిచ్చింది. `కాస్త శాంతించండి అబ్బాయిలూ.. సోష‌ల్ మీడియా నుంచి విరామం తీసుకొంటున్నా. పూరి క‌నెక్ట్స్ సంస్థ మ‌రింత శ‌క్తిమంతంగా తిరిగి వ‌స్తుంది` అని ఛార్మీ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసి బ్రేక్ ఇచ్చింది.  `లైగ‌ర్‌` ప‌రాజ‌యంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా ఛార్మీపై నెటిజ‌న్ లు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. లైగ‌ర్ మూవీని డైరెక్ట్ చేసింది పూరినా, ఛార్మీనా అంటూ కామెంట్ లు చేశారు.

దీంతో హర్ట్ అయిన ఛార్మీ తాను సోష‌ల్ మీడియా నుంచి విరామం తీసుకుంటున్న‌ట్టుగా ప్ర‌క‌టించింది. తాజాగా మ‌రో హీరోయిన్ ఇదే త‌ర‌హాలో సోష‌ల్ మీడియాకు బ్రేక్ ఇచ్చింద‌ని తెలిసింది. రీసెంట్ గా బ్ఆక్ టు బ్యాక్ భారీ ఫ్లాపుల్ని సొంతం చేసుకుంది రాశీఖన్నా.

రీసెంట్ గా ఆమె న‌టించిన థాంక్యూ, ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ బ్యాక్ టు బ్యాక్ విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అనిపించుకున్నాయి. అయినా స‌రే అవ‌కాశాల్ని సొంతం చేసుకుంటున్న రాశీఖ‌న్నా సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ కు కొంత కాలం దూరంగా వుండాల‌ని నిర్ణ‌యించుకుంద‌ట‌.

ఈ విషయాన్ని ఇన్ స్టా స్టోరీస్ లో వెల్ల‌డించింది. అయితే ట్విట్ట‌ర్ కు దూర‌మైనా కానీ ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానుల‌కు నిత్యం అందుబాటులో వుంటాన‌ని స్ప‌ష్టం చేసింది. రీసెంట్ గా శ‌ర్వానంద్ హీరోగా కృష్ణ చైత‌న్య రూపొందిస్తున్న పొలిటిక్ యాక్ష‌న్ డ్రామాలో హీరోయిన్ గా ఎంపికైన రాశీఖ‌న్నా ఈ మూవీతో పాటు కార్తీతో `స‌ర్దార్‌`. హిందీలో `యోధా` సినిమాల్లో న‌టిస్తోంది. ఇదిలా వుంటే ధ‌నుష్ న‌టించిన `తిరు` మూవీ మంచి విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. ఇందులో రాశీఖ‌న్నా.. నిత్యామీన‌న్ తో క‌లిసి ఓ హీరోయిన్ గా న‌టించింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News