డ్రెస్సింగ్ లో బీటౌన్ జనాలకు హృతిక్ ను గుర్తు చేసిన రష్మిక..!

Update: 2022-09-17 10:30 GMT
టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకొని బాలీవుడ్ లో అడుగుపెడుతున్న హీరోయిన్ల జాబితాలో రష్మిక మందన్నా కూడా చేరుతోంది. తెలుగులో చాలా తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకున్న ఈ బ్యూటీ.. 'పుష' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలో హిందీలో వరుస అవకాశాలు అందుకుంటోంది.

రష్మిక మందన్నా "గుడ్ బై" అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేయడానికి రెడీగా ఉంది. వికాస్ బాహ్ల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించింది రష్మిక. ఈ సినిమా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
ఇక బాలీవుడ్ డెబ్యూ మూవీ కోసం రష్మిక దూకుడుగా ప్రమోషన్స్ చేస్తోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో గ్లామరస్ దుస్తులతో బీ టౌన్ జనాల దృష్టిని ఆకర్షించిన నేషనల్ క్రష్.. తాజాగా ముంబైలో జరిగిన 'హిక్' సాంగ్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె తన అవుట్ ఫిట్స్ అందరూ మాట్లాడుకునేలా చేసింది.

రష్మిక ఈ కార్యక్రమంలో బ్లూ కలర్ డెనిమ్ జాకెట్ మరియు రెడ్ కలర్ కార్గో ప్యాంట్ ధరించి చాలా అందంగా కనిపించింది. అయితే ఆమె లుక్ అందరికీ బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ వింటేజ్ లుక్ ని గుర్తు చేసింది.

హృతిక్ రోషన్ - ప్రీతి జింటా జంటగా నటించిన 'కోయి మిల్ గయా' చిత్రంలోని 'ఇట్స్ మ్యాజిక్' పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో హృతిక్ ధరించిన డ్రెస్ ఫార్మాట్ లోనే రష్మిక దర్శనమిచ్చింది. దీంతో ఇద్దరి ఫోటోలను పక్కపక్కన పెట్టి నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. క్రష్మిక స్టైలింగ్ లో 2003 నాటి హృతిక్ ని ఫాలో అవుతోందని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, రష్మిక మందన్నా 'గుడ్ బై' తో పాటుగా మరో రెండు హిందీ చిత్రాల్లో నటిస్తోంది. శంతను బాగ్చి దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి 'మిషన్ మజ్ను' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే రణబీర్ కపూర్ మరియు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'యానిమల్' మూవీలో భాగమవుతోంది.

సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో రూపొందనున్న 'పుష్ప 2' సెట్స్ లో అడుగుపెట్టడానికి రష్మిక రెడీ అవుతోంది. విజయ్ హీరోగా నటిస్తున్న 'వారసుడు' అనే తెలుగు తమిళ ద్విభాషా చిత్రంలోనూ ఈ లక్కీ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News