సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన దక్కింది. మొదట్లో కలెక్షన్స్ భారీగా ఉన్నప్పటికీ నెమ్మదిగా డ్రాప్ అవుతున్నాయని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో స్పందన రాకపోవడానికి కారణాలు ఏంటా అని చర్చలు సాగుతున్నాయి. కారణాలు చాలానే ఉన్నప్పటికీ ప్రధానంగా రష్మిక పేరు వినిపిస్తూ ఉండడంతో రష్మిక అప్సెట్ అయిందని టాక్ వినిపిస్తోంది.
సినిమా విడుదలకు ముందు ప్రచారం చేసినట్టుగా కంటెంట్ లో అంత దమ్ములేదని సినిమా రిలీజ్ రోజే రివ్యూయర్లు.. విమర్శకులు తేల్చారు. ఇక మాస్ ఎంటర్టైనర్ కు కావాల్సిన కమర్షియల్ మీటర్లో ఒక్కో అంశం ఫిక్స్ చేసినట్టుగా స్కేల్ ప్రకారం స్క్రీన్ ప్లే నడిచిందని కూడా అంటున్నారు. అయితే ట్రైన్ కామెడీ పెద్దగా ప్రభావం చూపించక పోవడం.. సెకండ్ హాఫ్ వీక్ కావడం.. క్లైమాక్స్ తేలిపోవడం.. దేవీ శ్రీ ప్రసాద్ తన స్థాయికి తగ్గట్టుగా మ్యూజిక్ ఇవ్వకపోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నప్పటికి రష్మిక వల్లే సినిమాకు నష్టం జరిగినట్టుగా కథనాలు రావడంతో రష్మిక అప్సెట్ అయిందట. ఈ నెగెటివ్ పబ్లిసిటీ ఏంట్రా నాయనా అని తలపట్టుకుంటోందట.
సినిమాలో రష్మికది ఓవర్ యాక్షన్ అని.. అలా చెయ్యడం వల్లే సినిమాకు మైనస్ గా మారిందని అంటున్నారు కానీ తన పాత్రను ఓవర్ యాక్షన్ చేసే అమ్మాయిలాగా డిజైన్ చేసినప్పుడు రష్మిక మాత్రం ఏం చెయ్యగలదు.. డైరెక్టర్ చెప్పినట్టు చేసుకుపోవడం తప్ప. ఈ విషయంలో రష్మికను ఎవరైనా ఎలా వేలెత్తి చూపించగలరు? రష్మిక పాత్ర డైలాగ్ వేసినట్టు.. ఈ లాజిక్ "మీకు అర్థం అవుతోందా?"