త‌న అభిమాన హీరో స‌ర‌స‌న ర‌ష్మిక‌.. సినిమా కన్ఫాం!

Update: 2021-02-08 14:30 GMT
'ర‌ష్మిక మంద‌న్న‌..' టాలీవుడ్లోనే కాదు ఎక్కడ నటించినా లక్కీ గాళ్ గా సక్సెస్ అందుకుంటోంది. తెలుగులో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉంది రష్మిక. ప్రతీ టాప్ హీరో ఫస్ట్ ఛాయిస్ రష్మికే అన్నట్టుగా మారింది పరిస్థితి. ఈ విధంగా.. ఇటు టాలీవుడ్లోనే కాక.. అటు తమిళ్, హిందీ సినిమాల్లోనూ అవకాశాలు చేజిక్కించుకుంటూ దూసుకెళ్తోంది.

ప్రతీ ఇండస్ట్రీలోనూ అగ్ర హీరోలతో కలిసి నటిస్తున్న ఈ బ్యూటీకి.. తన అభిమాన హీరో సరసన నటించాలని ఎప్పటి నుంచో కోరుకుంటోంది. ఆయన మరెవరో కాదు.. కోలీవుడ్ అగ్ర కథానాయకుడు విజయ్‌. దళపతి సరసన నటించాలని రష్మిక చాన్నాళ్లుగా ఆశపడుతున్నప్పటికీ.. అవకాశం రాలేదు.

గతంలో ఓసారి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఎట్టకేలకు తాజాగా ఆ ఛాన్స్ రష్మికను వరించినట్టు సమాచారం. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మికను ఎంపిక చేసినట్టు సమాచారం.

రష్మికకు తెలుగుతోపాటు తమిళంలోనూ మాంచి క్రేజ్ ఉంది. ఇక, మాస్టర్ సినిమాతో విజయ్ మార్కెట్ తెలుగులోనూ భారీగానే విస్తరించింది. దీంతో.. రెండు ఇండస్ట్రీల్లోనూ సత్తా చాటేందుకు రష్మికను హీరోయిన్‌గా తీసుకున్నారట. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.కాగా.. రష్మిక తమిళంలో నటించిన తొలి సినిమా `సుల్తాన్`. కార్తీ హీరోగా నటించిన ఈ మూవీ ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు హిందీలో మిషన్ మజ్ను అనే సినిమాలోనూ నటిస్తోంది రష్మిక.
Tags:    

Similar News