ర‌త్సాస‌న్ మూవీ బంగ్లా భాష‌లోనూ

Update: 2022-07-09 01:30 GMT
సైకో కిల్ల‌ర్ కాన్సెప్టుల‌తో బోలెడ‌న్ని సినిమాలు తెర‌కెక్కి విజ‌యాలు అందుకున్నాయి.  పిల్ల‌ల‌ను చంప‌డం.. లేదా అమ్మాయిల‌ను అత్యాచారం చేసి చంప‌డం లాంటి సైకో కిల్ల‌ర్ స్టోరీలు యువ‌త‌రాన్ని విశేషంగా ఆక‌ర్షిస్తాయి. ఇదే కేట‌గిరీలో తెర‌కెక్కిన క‌మ‌ల్ హాస‌న్ రాఘ‌వ‌న్- విష్ణు విశాల్ ర‌త్సాస‌న్ (రాక్ష‌సుడు) చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద‌ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాలు సాధించాయి. ఈ జాన‌ర్ లో ప‌రిమిత బ‌డ్జెట్లో సినిమాల‌ను తెర‌కెక్కించేందుకు ప‌లువురు ఫిలింమేక‌ర్స్ ప్ర‌య‌త్నించి స‌ఫ‌ల‌మ‌య్యారు.

అయితే చాలా సినిమాల‌కు విదేశాల్లో జ‌రిగిన కొన్ని నిజ‌జీవిత క్రైమ్ క‌థ‌లు స్ఫూర్తి. అప్ప‌ట్లో గౌత‌మ్ మీన‌న్ తెర‌కెక్కించిన రాఘ‌వ‌న్ చిత్రానికి అమెరికాలో ని ఒక రియ‌ల్ సైకో కిల్ల‌ర్ స్టోరీ స్ఫూర్తి. ప్ర‌మాద‌కారి అయిన ఒక డాక్ట‌ర్ అమ్మాయిలను రేప్ చేసి చంపేస్తుంటాడు.

సాక్ష్యాలు దొర‌క్కుండా అడ‌వుల్లో మ‌గువ‌ల మృత‌దేహాల‌ను దాచిపెడ‌తాడు. దీనిని ఇండియన్ ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్ క‌మ‌ల్ హాస‌న్ ఎలా క‌నిపెట్టాడు?  సైకో కిల్ల‌ర్ క‌థ‌కు క్లైమాక్స్ ఎలా ఇచ్చాడు అన్న‌దే క‌థాంశం. ఈ క‌థ‌లో సైకోకిల్ల‌ర్ కి ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్ కి ఇండియ‌న్ క‌నెక్టివిటీ ఇచ్చారు క‌థ‌లో ఇంప్రెష‌న్ కోసం నేటివిటీ ట‌చ్ కోసం. కానీ మూల క‌థ‌ను మాత్రం అమెరికాలో జ‌రిగిన నిజ‌క‌థ నుంచి ఎంపిక చేసుకున్నారు.

ఇంత‌కుముందు విష్ణు విశాల్ న‌టించిన రాక్ష‌సుడు (ర‌త్సాస‌న్) చిత్రానికి విదేశాల్లో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు స్ఫూర్తి. జాక్ ది రిప్పర్ అనే ఇంగ్లాండ్ కి చెందిన సీరియల్ కిల్లర్ క‌థ ర‌త్సాస‌న్ కి స్ఫూర్తి అని చెబుతారు. అలాగే రష్యా సీరియల్ కిల్లర్ నం.1 `సైబీరియన్ రిప్పర్` ఈ త‌ర‌హా క్రిమిన‌ల్. నిజ‌జీవిత క‌థ‌ల నుంచి స్ఫూర్తి పొంది వాటికి నేటివిటీ ట‌చ్ ఇవ్వ‌డం ద్వారా ద‌ర్శ‌కులు స‌క్సెస‌య్యారు.

ర‌త్సాస‌న్ ఇంత‌కుముందు బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా రాక్ష‌సుడు పేరుతో రీమేకై తెలుగులో స‌క్సెస్ సాధించింది. ఇప్ప‌టికీ ఈ సినిమా ప‌లు భాష‌ల్లోకి అనువాద‌మై అక్క‌డా ఆక‌ట్టుకుంటోంది. పాపుల‌ర్ బంగ్లా యాప్ బోంగో లోనూ ర‌త్సాసన్ బంగ్లా భాషలోకి నోరో పిశాచ్ పేరుతో డబ్బింగ్ అయ్యి విడుదలైంది. 2018 దక్షిణ భారత బ్లాక్ బస్టర్ సైకోడ్రామా థ్రిల్లర్ విష్ణు విశాల్ -అమలా పాల్ నటించిన ఈ మూవీకి బంగ్లా ఆడియెన్ లో క్రేజ్ నెల‌కొంది. ఈ శుక్రవారం జూలై 8న ఇది బంగ్లా భాష‌లో విడుద‌లైంది.

ద‌ర్శకుడు కావాల‌నుకునే అరుణ్ కుమార్  ఫిల్మ్ మేకింగ్ లో వృత్తిని కొనసాగించాలని ప్ర‌య‌త్నించినా.. అతని కుటుంబ పరిమితులు తిర‌స్క‌ర‌ణ‌ల‌తో అరుణ్ ని తన కలను విడిచిపెట్టి పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ గా ఉద్యోగం చేయవలసి వస్తుంది. అతని కొత్త ఉద్యోగ పాత్రకు సర్దుబాటు చేస్తున్నప్పుడు యువ హైస్కూల్ బాలికలను లక్ష్యంగా చేసుకున్న క్రూరమైన సీరియల్ కిల్లర్ వార్తలతో నగరం ఆందోళన చెందుతుంది. స్క్రీన్ రైటర్ గా తన నైపుణ్యాలను ఉపయోగించి .. కిల్లర్ మనస్సులో ఉన్న‌ది ఏమిటో క‌నిపెట్టి అత‌డిని ఎలా వెతికి ప‌ట్టుకున్నాడు? అన్న‌దే సినిమా.

కొత్త‌వాడైన అరుణ్ స్కిల్ పై న‌మ్మ‌కం లేని పై ఆఫీస‌ర్ అత‌డిని త‌క్కువ చూపు చూసినా కానీ... సీరియల్ కిల్లర్ వల్ల వ్యక్తిగతంగా నష్టం వాటిల్లడంతో పోలీసు యూనిట్ అతలాకుతలమైనప్పుడు పోలీసు చీఫ్ కమోల్ నేరస్థుడిని కనుగొనడానికి అరుణ్ ని చివ‌ర‌కు నియమిస్తాడు. రామ్ కుమార్ దర్శకత్వం వహించిన డార్క్ సైకో థ్రిల్లర్ కథాంశం అభివృద్ధి చేయ‌డానికి నాలుగు సంవత్సరాలు ప‌ట్టింది. సీరియల్ కిల్లర్స్ పై చాలా పరిశోధనలను ఈ మూవీ ప్లాట్ లో ఉప‌యోగించారు.

ముఖ్యంగా 15 మంది కంటే ఎక్కువ మంది పిల్లలను దారుణంగా చంపిన రష్యన్ `సైబీరియన్ రిప్పర్` అలెగ్జాండర్ నికోలాయెవిచ్ స్పెసివ్ట్సేవ్ కథనే `ర‌త్సాస‌న్ అకా నోరోపిషాచ్` మూవీ కోసం ఎంచుకునేలా కుమార్ ను ప్రేరేపించింది. అమలా పాల్- విష్ణు విశాల్ నటించిన ఈ చిత్రం 5 అక్టోబర్ 2018 న విడుదలైంది. ఇది ప్రేక్షకుల నుండి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  క‌మ‌ర్షియ‌ల్ గా పెద్ద‌ విజయాన్ని సాధించింది. థ్రిల్ తో పాటు సినిమాలో రొమాన్స్ ఆక‌ట్టుకుంటుంది. హీరోయిన్ అమలా పాల్ `బిత్తి` అనే టీచర్ పాత్రను పోషించగా త‌న న‌ట‌న అస్సెట్ అయ్యింది. గిబ్రాన్ సంగీతం ఆక‌ట్టుకుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ లో పాల్ తో హీరో రొమాన్స్ ఆస‌క్తిక‌రం. ఈ చిత్రం బంగ్లా భాష‌లో విడుద‌లైంది. బొంగో చానెల్ లైసెన్సింగ్ -పంపిణీ హెడ్ కరోలిన్ హోప్నర్ మాట్లాడుతూ ..ర‌త్సాస‌న్ బంగ్లా భాష‌లో  నోరోపిశాచ్ గా విడుద‌ల‌వుతోంది..అని తెలిపారు. బోంగో అనేది బంగ్లాదేశ్ స్థానిక భాష‌ల్లో అతి పెద్ద  స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ గా పాపుల‌రైంది.
Tags:    

Similar News