మాస్ మహారాజా రవితేజ ఎప్పుడూ ఒకిరిపై సెటైర్లు వేసింది లేదు. చాలా కూల్ గా కామ్ గా వుంటూ వన్ లైనర్స్ వదిలినట్టుగా మాట్లాడతారే కానీ ఎవరిపై పెద్దగా సెటైర్లు వేయరు. పెద్దగా మాట్లాడాల్సిన ప్రసంగాలని కూడా అతి తక్కువగా మాట్లాడి ముగించేస్తుంటారు. కానీ `ఖిలాడీ` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ మాట్లాడిన మాటల్లో మాత్రం సెటైర్ ధ్వనించింది. ఈ మూవీ ఈ శుక్రవారం అంటే ఫిబ్రవరి 11న విడుదలవుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా హీరో రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ మధ్య ఏదో జరుగుతోందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
రవితేజ ఈ చిత్ర రిలీజ్ ని 18న రిలీజ్ చేయాలని పట్టుబడితే.. దర్శకుడు, నిర్మాత మాత్రం ఈ నెల 11నే రిలీజ్ చేయాలని పట్టుబట్టారని మొత్తానికి వారు అనుకున్న ప్రకారమే 11న విడుదల చేస్తున్నారని వార్తలు మొదలయ్యాయి. అయితే ఆ వార్తలు నిజమేనని స్పష్టం చేశారు రవితేజ. ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రవితేజ చేసిన వ్యాఖ్యలు గత కొన్నిరోజులుగా వస్తున్న వార్తలు నిజమని స్పష్టం చేశాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆలస్యంగా హాజరైన రవితేజ ఈ సందర్భంగా దర్శకుడు రమేష్ వర్మ, నిర్మాత కోనేరు సత్యనారాయణపై పాజిటివ్ గా స్పందించారు.
దర్శకుడు రమేష్ వర్మ చాలా అదృష్టవంతుడని, అతనికి సినిమా నిర్మాణం కోసం అన్నీ సమకూర్చగల కోనేరు సత్యనారాయణ లాంటి నిర్మాత లభించారని, అంతే కాకుండా సినిమా రిలీజ్ కి ముందే కాస్ట్ లీ కార్ ని బహుమతిగా పొందాడని, దీన్ని బట్టే అతను ఎంత అదృష్టవంతుడో స్పష్టమవుతోందని రవితేజ అన్నారు. అయితే ఆయన మాటల్లో సెటైర్ ధ్వనిస్తోందేంటని ఇండస్ట్రీ వర్గాలు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత గురించి మాట్లాడి మాటల్లోనూ సెటైరే ధ్వినించింది.. సినిమా తీస్తున్నప్పుడు అంతా వ్యక్తిత్వంతో చూసుకోవాలని లా చేస్తేనే చాలా నేర్చుకుంటారని అన్నారు. అంతే కాకుండా శ్రీకాంత్ విస్సా చెప్పిన కథ విని కోనేరు సత్యనారాయణతో తనకున్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పానని రవితేజ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతే కాకుండా శ్రీకాంత్ విస్సాను తనకు పరిచయం చేసినందుకు రమేష్ వర్మకు ధన్యవాదాలు తెలిపారు కూడా.
ఈ మాటల ద్వారా దర్శకుడి కంటే ఈ సినిమా విషయంలో రైటర్ శ్రీకాంత్ విస్సాకే రవితేజ అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యాఖ్యల కారణంగా రవితేజ, రమేష్ వర్మల మధ్య ఏం జరిగి వుంటేందనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో మొదలైంది. ఇక సినిమా డబ్బింగ్ ఆలస్యం కావడం వల్ల ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు రద్దు చేయడం కూడా పుకార్లకు మరింత ఆజ్యం పోసిందని అంటున్నారు. 11న శుక్రవారం విడుదలవుతున్న ఈ మూవీ ఫలితం ఎలా వుంటుందో చూడాలి.