టాలీవుడ్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా.. ఎంతో కష్టపడి స్వశక్తితో ఎదిగిన హీరోల్లో మాస్ రాజా రవితేజ ఒకడు. తాను నిలదొక్కుకున్నాక ఎందరికో లైఫ్ ఇచ్చిన రవితేజ.. గత కొన్నేళ్లలో మరీ క్యాల్కులేటెడ్ గా తయారయ్యాడన్న విమర్శలు వచ్చాయి. పారితోషకం విషయంలో కొండెక్కి కూర్చున్న మాస్ రాజా.. ఎలాంటి స్థితిలోనూ రాజీ పడకపోవడం వల్ల కొన్ని మంచి సినిమాలు వదులుకునే పరిస్థిితి తలెత్తినట్లు గుసగుసలు వినిపించాయి. మాస్ రాజా మొండి పట్టు వల్ల నిర్మాతలు ఇబ్బంది పడ్డట్లు కూడా ఇండస్ట్రీలో చర్చ జరిగింది. ఐతే ఒక సినిమా పోయినా ఇంకో సినిమా ఆడుతుంటే ఎంత పట్టుదలతో ఉన్నా పర్వాలేదు కానీ.. వరుసగా డిజాస్టర్లు ఎదురైతే మాత్రం ఇదే మొండి పట్టు కొనసాగిస్తే కష్టం.
గత ఏడాది మాస్ రాజాకు ఒకటికి మూడు డిజాస్టర్లు ఎదురయ్యాయి. ‘టచ్ చేసి చూడు’, ‘నేల టిక్కెట్టు, ‘అమర్ అక్బర్ ఆంటోని’.. ఇలా వరుసగా ఒకదాన్ని మించిన డిజాస్టర్ ఒకటి. దీంతో రవితేజ మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. ‘అమర్ అక్బర్ ఆంటోని’ లాంటి పెద్ద డిజాస్టర్ తర్వాత రవితేజ సినిమాపై బయ్యర్లలో ఏమాత్రం ఆసక్తి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన రవితేజ.. పారితోషకం విషయంలో మొండి పట్టుదలకు పోవడంతో వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి నిర్మించాల్సిన చిత్రంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఒక దశలో ఈ సినిమా ఆగిపోయిందని.. మైత్రీ వాళ్ల ప్రొడక్షన్లో సంతోష్ శ్రీనివాస్ సినిమానే రవితేజ ముందుకు తీసుకెళ్తున్నాడని కూడా ప్రచారం జరిగింది.
ఐతే ఇదంతా పక్కకు పోయి ఇప్పుడు రవితేజ-ఆనంద్-రామ్ తాళ్ళూరి సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతున్నట్లు అధికారిక సమాచారం బయటికి వచ్చింది. ఈ నెల 26న రవితేజ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా టైటిల్ లోగో లాంచ్ చేయబోతున్నట్లు నిర్మాత అధికారికంగా ప్రకటించాడు. ప్రెస్ నోట్ కూడా ఇచ్చాడు. పారితోషకం విషయంలో రవితేజ తగ్గడంతోనే ఈ ప్రాజెక్టు ఓకే అయి పట్టాలెక్కినట్లు తెలుస్తోంది.