స్టయిలిష్ అల్లు అర్జున్ అతి పెద్ద డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడనే చెప్పాలి. ఎందుకంటే ''సరైనోడు'' సినిమాకు అసలు ఆడియో రిలీజే లేదంటే చూసుకోండి. ఒక పెద్ద హీరో సినిమాకు అసలు సిసలైన ప్రమోషన్ మొదలయ్యేది ఈ ఆడియో కార్యక్రమాల తరువాతే. సాక్షాత్తూ మొన్న పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం గురించి చెప్పాడు. తాను కూడా ఇలాంటి కన్వెన్షనల్ ప్రమోషన్ ఈవెంట్లను చేపట్టక తప్పట్లేదని.. నిర్మాతలు తన మీద చాలా ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి.. ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా చేయాల్సిందేనని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు పవర్ స్టార్.
అయితే అల్లు అర్జున్ తన సరైనోడు ఫంక్షన్ క్యాన్సిల్ చేయడానికి ముఖ్య కారణం ఫ్యామిలీ అని తెలుస్తోంది. తన కజిన్ శ్రీజ పెళ్ళి కోసం దాదాపు ఐదు రోజుల ముందు నుండి ఇంటి వద్దనే ఉంటున్నాడు బన్నీ. తొలుత పెళ్ళి కూతురును చేసే ఫంక్షన్ ను కూడా అల్లు వారింట్లోనే జరిపారు. ఇక గత రాత్రి బెంగుళూరులో పెళ్ళి జరిగింది. ఈ నాలుగు రోజులూ బన్నీ అక్కడే ఉన్నాడు. చాలా ఏర్పాట్లను రామ్ చరణ్ చూసుకోగా.. తక్కిన పనులన్నీ బన్నీ అండ్ ఫ్యామిలీ చేస్తున్నారట. ఇప్పుడు 31న రిసెప్షన్ కూడా ఉంది. దానికి కూడా చాలా పనులుంటాయి. అందుకే ఈ వారంలో ఆడియో ఫంక్షన్ కోసం సమయం కేటాయించాలంటే జరగని పని. మరి 22న రిలీజ్ కాబట్టి.. 10వ తారీఖునే ఆడియో రిలీజ్ చేసుకోవచ్చుగా? అబ్బే అలా చేస్తే ఆడియో రిలీజయ్యి జనాలకు రీచ్ అవ్వడానికి టైమ్ పడుతుందిగా. అది సంగతి.