గీతా ఆర్ట్స్ సంస్థ బాలీవుడ్ చిత్రం రాబ్తాపై కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. తాము తీసిన మగధీర కథకి దగ్గరగా ఉందని, కథని కాపీ కొట్టారు కాబట్టి రాబ్తా సినిమా విడుదలని ఆపాలంటూ కోర్టుని ఆశ్రయించారు. ఆ విషయం రెండు పరిశ్రమల్లో చర్చని లేవనెత్తింది. వంద కోట్లకుపైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన చిత్రం మగధీర. అప్పట్లోనే బాలీవుడ్ లో రీమేక్ అవుతుందంటూ ప్రచారం సాగింది. షాహిద్ కపూర్ లాంటి ఒకరిద్దరు కథానాయకులు ప్రయత్నించారు కూడా. కానీ రకరకాల కారణాలవల్ల అది సాధ్యం కాలేదు. ఇంతలో రాబ్తా వివాదం తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ కేసు ఎంతవరకు వెళుతుందో అంటూ ఆసక్తికరంగా చూశారంతా. కానీ కోర్టు బయటే ఇరు వర్గాలు రాజీకొచ్చాయి.
దాంతో రాబ్తా విడుదలకి మార్గం సుగమమైంది. నిన్ననే ఆ చిత్రం విడుదలైంది. ఇప్పుడు గీతా ఆర్ట్స్ సంస్థ కేసును ఎందుకు వెనక్కి తీసుకొందనే విషయం గురించి చిత్రసీమలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. విడుదల ఆగితే సినిమాకి భారీ నష్టం వస్తుంది కాబట్టి, కొంత మొత్తం గీతా ఆర్ట్స్‌కి ముట్టజెప్పి కేసుని వాపస్ తీసుకొనేలా చేశారనే ప్రచారం ఒక పక్క సాగుతుంటే, మరోపక్క సెట్టైరికల్ గా చర్చ నడుస్తోంది. రాబ్తా స్క్రిప్టు చదివాక మగధీర టీమ్ అవమానంగా ఫీల్ అయ్యుంటుందని, మరో మాట లేకుండా వెంటనే కేసుని వెనక్కి తీసుకొనుంటుందని ఆన్ లైన్ లో మాట్లాడుకొంటున్నారు. ఈ రకమైన కామెంట్లు రాబ్తా టీమ్ కి ముమ్మాటికీ అవమానమే. నిన్ననే విడుదలైన రాబ్తా డిజాస్టర్ టాక్ తెచ్చుకొంది. సెన్స్‌లెస్ స్క్రిప్టు అంటూ విమర్శకులు చీల్చిచెండాడుతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కృతిసనన్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయినప్పటికీ, స్క్రిప్టు మాత్రం ప్రేక్షకుల తలలు బొప్పి కట్టేలా చేస్తోందట. అందుకే సినిమా విషయంలో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/