త్రిషకు మెగా ఛాన్స్ అందుకేనా?

Update: 2019-10-18 04:21 GMT
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' హడావుడి నెమ్మదిగా తగ్గుతోంది.  దీంతో చిరు నెక్స్ట్ ఫిలిం #చిరు152 గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి.  ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నారు. ఈమధ్యే ఈ సినిమాను లాంచ్ చేశారు.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది.  ఈ సినిమాలో చిరుకు జోడీగా హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి ఉంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చిరు సరసన హీరోయిన్ గా త్రిషను తీసుకుంటే బాగుంటుందని కొరటాల భావిస్తున్నారట.  ఇప్పటికే త్రిషతో చర్చలు కూడా జరుపుతున్నారని దాదాపుగా త్రిషనే ఫైనలైజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా నయన్.. తమన్నాల పేర్లు కూడా వినిపించాయి రెండు మూడు కారణాల వల్ల వారిని వద్దనుకుంటున్నారట. ఈ హీరోయిన్ల తో చిరు రీసెంట్ గానే పని చేశారు కాబట్టి ఈ సినిమాకు సేమ్ జోడీ అయితే ఫ్రెష్ ఫీల్ ఉండదనేది ఒక ఆలోచన.

మరొకటి అధిక పారితోషికం చెల్లించాల్సి రావడం. కొరటాల శివ సినిమాలో కథ ప్రధానంగా సామాజిక అంశాల చుట్టూ తిరుగుతుంది. ఇందులో లవ్ స్టొరీకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు.. చిరు వయసు ప్రకారం చూసుకున్నా లవ్ ఎపిసోడ్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది.  అందుకే హీరోయిన్ కోసం ఎక్కువ ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదనే అలోచనలో ఉన్నారట. అయితే త్రిష లాంటి సీనియర్ ను తీసుకుంటే చిరుకు జోడీ బాగుంటుందని.. చాలా కాలం తర్వాత త్రిష తెలుగులో నటించడం కాబట్టి ప్రేక్షకులకు కూడా కొత్తదనం ఉంటుందని అలోచిస్తున్నారట.  త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. త్రిష గతంలో చిరుతో 'స్టాలిన్' సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఛాన్స్ వస్తే మెగాస్టార్ తో నటించడం రెండోసారి అవుతుంది.
Tags:    

Similar News