టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో గ్లామర్ డాళ్ అనిపించుకుంటోంది రకుల్ ప్రీత్ సింగ్. అసలు తాను ఇలాంటి ఇమేజ్ సాధిస్తానని అనుకోలేదని చెబుతోందీ భామ.
తను పరిచయమైన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ - ఆ తర్వాత కరెంట్ తీగ - పండగ చేస్కో - కిక్ 2 చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేయలేదని.. కానీ బ్రూస్ లీ - నాన్నకు ప్రేమతో - సరైనోడు చిత్రాల్లో మాత్రం గ్లామర్ గాళ్ గా నటించానని అంటోంది రకుల్.
మరో మూడు రోజుల్లో విడుదల కానున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ సరైనోడులో తన పాత్ర పేరు మహాలక్ష్మి అని చెప్పిన ఈ సుందరి.. సినిమాలో బన్నీ మాత్రం వేరే పేరుతో పిలుస్తాడట. అదేంటో ఇప్పుడు చెప్పను సస్పెన్స్ అంటూ తెగ మురిసిపోతోంది రకుల్.
తన గత చిత్రం నాన్నకు ప్రేమతో కోసం డబ్బింగ్ చెప్పిన ఈ భామ.. సరైనోడుకి మాత్రం గొంతు అరువివ్వలేదు. దీనికి కారణం.. ఈ పాత్ర రాజమండ్రి ప్రాంతానికి చెందిన ఓ పల్లెటూరి పిల్ల కావడమేనట. తన లాగా తెలుగు నేర్చుకుని మాట్లాడేవారికి ఆ యాస మాట్లాడ్డం అంత సులువు కాదని, అందుకే డబ్బింగ్ చెప్పలేదంటోంది రకుల్.
ఇక సినిమాల ఎంపిక విషయంలో తన కేరక్టర్ ఒక్కదాన్ని మాత్రమే తను చూసుకుంటుందట. ఆ పాత్ర నచ్చితేనే చేస్తానని, మనసుకు నచ్చకుండ 2-3 నెలలు ఆ పాత్రలో నటిస్తూ ఉండడం చాలా కష్టం అంటోందీ వయ్యారి.
గ్లామర్ హీరోయిన్ అయినా.. సరైనోడులో తన పాత్రతో పాటు, కేథరిన్ పోషిస్తున్న ఎమ్మెల్యే పాత్రకు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుందని రకుల్ చెప్పింది. ఇక బోయపాటికి కేరక్టర్లపై చాలా క్లారిటీ ఉంటుందని.. డైరెక్టర్ చేసి చూపించినట్లు నటిస్తే చాలంటూ.. సరైనోడు దర్శకుడిని తెగ పొగిడేసింది రకుల్.