క్వీన్ కంగన రనౌత్ వర్సెస్ బాలీవుడ్ టాప్ గన్స్ ఇష్యూలో శివసేన రంగ ప్రవేశంతో రచ్చరచ్చవుతున్న సంగతి తెలిసిందే. కంగన ముంబై కార్యాలయాన్ని కుప్పకూల్చిన అనంతరం గవర్నర్ ని కలిసేందుకు వెళ్లడంపైనా చర్చ సాగుతోంది. ఇక కంగన చండీగర్ నుండి ముంబైకి వెళ్లే క్రమంలో విమానాశ్రయంలో మీడియా ఉన్మాదంపై రకరకాల చర్చ సాగింది. పలు వివాదాల నడుమ ఈ ప్రయాణం హీట్ పెంచగా.. ఏవియేషన్ రెగ్యులేటరీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేదా డిజిసిఎ నుంచి సీరియస్ ఆదేశాలు అందాయి.
విమానాశ్రయంలో ఎవరైనా ఫోటోలు తీస్తూ దొరికితే రెండు వారాల పాటు విమానాలను నిలిపివేయాలని విమానయాన సంస్థలకు హెచ్చరికలు అందాయి. ప్రభుత్వం ఆదేశించిన నిబంధనలకు విరుద్ధంగా నియమాన్ని ఉల్లంఘించిన వారిపై చర్య తీసుకోవాలని లేదా చర్యను ఎదుర్కోవాలని విమానయాన సంస్థలకు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఏవియేషన్ రెగ్యులేటరీ ఆ మేరకు అనుమతి లేని వారిపై ఎవరూ ఫోటో తీయకూడదు అని హెచ్చరించడం విశేషం. విమానం ల్యాండింగ్.. టేకాఫ్ లేదా డిఫెన్స్ ఏరోడ్రోమ్ వద్ద మైదానంలో ఉన్నప్పుడు ఫోటోలు తీయరాదని రూల్ పాస్ చేయడం విశేషం.
నిజానికి శ్రద్ధ లేకపోవడం వల్ల విమానయాన సంస్థలు ఈ నియమాలను పాటించడంలో తరచుగా విఫలమవుతున్నాయని నొక్కిచెప్పడంతో ఫ్లైట్ ఆపరేటర్లకు కఠినమైన హెచ్చరిక ఇదన్న చర్చా సాగుతోంది. ఇకపై అలాంటి ఉల్లంఘన ఏదైనా జరిగితే .. ఆ నిర్దిష్ట మార్గానికి విమాన షెడ్యూల్ మరుసటి రోజు నుండి రెండు వారాల పాటు నిలిపివేయబడుతుందని ప్రకటించడం కలకలం రేపింది. ఉల్లంఘనకు కారణమైన వారిపై అవసరమైన అన్ని శిక్షా చర్యలు వైమానిక సంస్థ తీసుకున్న తరువాత మాత్రమే అనుమతులు లభిస్తాయని హెచ్చరించడం విశేషం.
ఆన్ లైన్ వీడియోలలో విలేకరులు ప్రభుత్వం ఆదేశించిన కోవిడ్ ప్రోటోకాల్ లను ఉల్లంఘించడం.. మైక్స్ లో మాట్లాడటం లేదా మొబైల్ ఫోన్ వీడియోలు తీయడం వంటివి కుదరదని వార్నింగులు చెబుతున్నాయి. ముఖ్యంగా కంగనా రనౌత్ లాంటి స్టార్ ని మీడియా వెంటాడటం.. మధ్యలో విమానం నుండి తమ ఛానెల్ ల కోసం రిపోర్ట్ చేస్తున్నప్పుడు కనిపించకూడదన్న నియమాన్ని ఏవీయేషన్ రూపొందించడం గమనార్హం.
33 ఏళ్ల కంగన మహారాష్ట్ర శివసేన అధినేతతో తలపడి ఆ రోజు ముంబైకి తిరిగి వెళుతున్న క్రమంలో సాగిన డ్రామా ఇది. భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో తన సొంత సిబ్బందిని హెచ్చరిస్తూ.. ఆ విమానంలో అన్నిరకాల ప్రోటోకాల్ ను అనుసరించాలని చెప్పారట. మా క్యాబిన్ సిబ్బంది, అలాగే కెప్టెన్ ఫోటోగ్రఫీని పరిమితం చేయడం, సామాజిక దూరాన్ని అనుసరించడం మరియు మొత్తం భద్రతను కాపాడుకోవడం పై దృష్టి సారించామని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది.