ఆ లిప్ లాక్ వెనుక అంత పెద్ద కుట్ర‌

Update: 2016-12-12 04:52 GMT
ఇప్పుడైతే బాలీవుడ్లో లిప్ లాక్స్ అన్న‌వి కామ‌న్ అయిపోయాయి. కానీ 80లు.. 90ల్లో ముద్దు స‌న్నివేశాలు అరుదు. మామూలు ముద్దు స‌న్నివేశాలు తీయాల‌న్నా హీరోయిన్ల‌ను ఒప్పించ‌డం క‌ష్ట‌మ‌య్యేది. అలాంటిది హీరోయిన్ కు ఒక్క మాటైనా చెప్ప‌కుండా.. హీరో.. ద‌ర్శ‌కుడు అంద‌రూ క‌లిసి కుట్ర ప‌న్ని.. సెట్లో యూనిట్ స‌భ్యులంద‌రూ కుమ్మ‌క్క‌యి.. 15 ఏళ్ల వ‌య‌సున్న ఓ హీరోయిన్ని లిప్ లాక్ ఉచ్చులోకి లాగి పైశాచిక ఆనందాన్ని అనుభ‌వించిన తీరు వెలుగులోకి వ‌చ్చింది. ఈ కుట్ర‌కు బ‌లైంది లెజెండ‌రీ హీరోయిన్ రేఖ కావ‌డం గ‌మ‌నార్హం. 
రేఖః ది అన్ టోల్డ్ స్టోరీ పేరుతో రాసిన పుస్త‌కంలో ఈ వ్య‌వ‌హారం మొత్తం బ‌ట్ట‌బ‌య‌లైంది.

రేఖ‌కు 15 ఏళ్ల వ‌య‌సుండ‌గా ఆమె అంజానా స‌ఫ‌ర్ అనే సినిమా చేసింది. అందులో హీరో భిశ్వ‌జీత్‌. ఆ చిత్రానికి ద‌ర్శ‌కుడు రాజ్ న‌వాథె. ఓ రోజు షూటింగుకి ముందుగా రేఖ‌తో లిప్ లాక్ సీన్ కు సంబంధించి డైరెక్ట‌ర్.. హీరో ముందుగానే కుట్ర ప‌న్నార‌ట‌. ఆ సీన్ గురించి రేఖ‌కు త‌ప్ప యూనిట్లో అంద‌రికీ తెలుసు. స‌న్నివేశం తీయ‌డానికి అంతా సిద్ధ‌మ‌య్యాక డైరెక్ట‌ర్.. యాక్ష‌న్ చెప్పాడ‌ట‌. అంతే హీరో భిశ్వ‌జీత్ రేఖ‌ను ద‌గ్గ‌రికి లాక్కున్నాడు. ఆమె పెద‌వుల్ని అందుకుని లిప్ లాక్ చేసేశాడు. అలా నిమిషం రెండు నిమిషాలు కాదు.. ఏకంగా ఐదు నిమిషాల పాటు రేఖ పెద‌విని వ‌ద‌ల్లేద‌ట భిశ్వ‌జీత్‌. డైరెక్ట‌ర్ క‌ట్ చెప్ప‌కుండా వినోదం చూస్తుంటే.. సెట్లో ఉన్న మిగ‌తా జ‌నాలు చ‌ప్ప‌ట్లు చ‌రుస్తూ.. విజిల్స్ కొడుతూ ఉన్నార‌ట‌. రేఖ క‌ళ్లు మూసుకుని దాదాపుగా ఏడుస్తూ ఈ స‌న్నివేశం పూర్త‌య్యే వ‌ర‌కు వేచి చూసింద‌ట‌.
Tags:    

Similar News