కార్తికేయ - తాన్య రవిచంద్రన్ జంటగా 'రాజా విక్రమార్క' సినిమా రూపొందింది. ఈ సినిమాలో కార్తికేయ ఎన్.ఐ.ఎ. ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక తాన్య రవిచంద్రన్ హొమ్ మినిష్టర్ కూతురు పాత్రను పోషించింది. సాయికుమార్ కీలకమైన పాత్రలో కనిపించనున్న ఈ సినిమా యాక్షన్ కామెడీ జోనర్లో నిర్మితమైంది. 88 రామారెడ్డి నిర్మాణంలో .. శ్రీ సరిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి 'సమ్మతమే' అనే ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
"ఈ తొలి ప్రేమానందం వర్ణించలేనులే .. నాజతలో నీ అందం వందేళ్లపాటు వెండి వెన్నెలే .. సమ్మతమే .. సంబరమే" అంటూ ఈ పాట సాగుతోంది. ప్రశాంత్ విహారి స్వరపరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా .. కార్తీక్ ఆలపించాడు. మెలోడీగా తరహాలో మొదలైన ఈ పాట ఫాస్టు బీట్ గా మారిపోయి .. మధ్యలో సంప్రదాయ సంగీతపు సొగసులను సంతరించుకుని ఈ తరం కుర్రకారుకు నచ్చేలా సాగుతుంది. నాయకా నాయికలపై టెంపుల్ బ్యాక్ గ్రౌండ్ లో మొదలయ్యే ఈ పాట ఆకట్టుకుంటోంది. ఫొటోగ్రఫీ .. కొరియోగ్రఫీ రెండూ కుదిరిన ఒక పాట ఎలా ఉంటుందో ఈ పాట అలా ఉంది.
కార్తికేయ మంచి డాన్సర్ అనే విషయం తెలిసిందే. ఈ పాటలో ఫాస్టుగా ఆయన వేసే క్లిష్టమైన స్టెప్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో ఆయన మరింత హాండ్సమ్ గా కనిపిస్తే .. తాన్య చాలా బ్యూటిఫుల్ గా హృదయాలను కొల్లగొట్టేస్తోంది. విజువల్స్ చాలా బాగా అనిపిస్తున్నాయి. అయితే 'ప్రేమానందం' అనే పదాలను విడగొట్టకుండా పాడితే బాగుండేది. పాటలోనే లవ్ .. రొమాన్స్ .. కామెడీని కలిపి చూపించేశారు. తాన్య రవిచంద్రన్ ఈ సినిమాతోనే తెలుగు తెరకి పరిచయమవుతోంది. గ్లామర్ పరంగా చూసుకుంటే ఇక్కడ మరికొన్ని అవకాశాలను అందుకునేలానే కనిపిస్తోంది.
ఇక కార్తికేయ ఈ సినిమాతో ఒక సాహసమే చేశాడని చెప్పాలి. ఆయన ఇప్పటికే వరుసగా నాలుగు ఫ్లాపులతో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడానికి ఎవరూ ఒప్పుకోరు. కానీ ఈ సినిమాకి డైరెక్టర్ తో పాటు కెమెరామెన్ .. ఎడిటర్ కూడా కొత్తవారే కావడం విశేషం. అయినా ఈ సినిమాతో తాను ఇంతకాలంగా ఎదురుచూస్తున్న హిట్టు ఎగురుకుంటూ వచ్చి వలలో పడటం ఖాయమనే బలమైన నమ్మకంతో ఆయన ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో .. థియేటర్ల నుంచి ఎలాంటి టాక్ ను తెచ్చిపెడుతుందో చూడాలి.
Full View