ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ విడుదల తేదీ అధికారిక ప్రకటన వచ్చింది. గత కొన్ని రోజులుగా మీడియాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన విడుదల తేదీ గురించి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో వర్మ మార్చి 22న లక్ష్మీస్ ఎన్టీఆర్ ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. వర్మ ప్రకటనతో పుకార్లకు చెక్ పెట్టినట్లయ్యింది. ఎన్టీఆర్ జీవితంలో కొన్ని కీలక ఘట్టాలు అప్పట్లో మీడియా కవర్ చేయలేదు. కొన్ని పరిస్థితుల కారణంగా మీడియా కవర్ చేయక పోవడం, జనాలకు తెలియకుండా పోయిన విషయాలను వర్మ తన సినిమాలో చూపించబోతున్నాడు.
రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను అనౌన్స్ చేసినప్పుడు చేస్తాడని ఎవరు భావించలేదు. షూటింగ్ ప్రారంభం అయ్యింది అంటూ వర్మ ప్రకటించిన తర్వాత కూడా సినిమా విడుదల అయ్యేది అనుమానమే అంటూ కొందరు భావించారు. ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమా ట్రైలర్ తోనే సరిపెడతాడేమో, సినిమా విడుదల గురించి చెప్పడం లేదు కనుక అసలు విడుదల చేసే ఆలోచన ఉందో లేదో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఎట్టకేలకు వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ను విడుదల తేదీని ప్రకటించిన నేపథ్యంలో ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారిలో మరింత ఉత్సాహం పెరిగింది.
ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడును మెయిన్ విలన్ గా చూపించబోతున్నట్లుగా ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ను బట్టి అర్థం అవుతుంది. వర్మ కూడా పదే పదే ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసినట్లుగా చెప్పకనే చెప్పాడు. దాంతో తెలుగు దేశం పార్టీ నాయకులను ఈ చిత్రం ఇబ్బంది పెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.