వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్ధమాన సినీ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించి మరీ వివాదాలు రాజేయడం కొత్తమీ కాదు.. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ తో వర్మ అదే పని పెట్టుకున్నాడు. ట్వీట్లు చేస్తూ హోరెత్తిస్తుంటాడు.
తాజాగా ఏపీ ప్రభుత్వానికి, ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మధ్య చోటుచేసుకున్న వివాదంపై రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ట్వీట్లు చేసి కాక రేపాడు.రఘురామను ఏపీ పోలీసులు ఎందుకు కొట్టారో సీక్రెట్ చెప్పాడు.
లాక్ డౌన్ సమయంలో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నవారంతా ఎంపీ రఘురామ కేసును స్ఫూర్తిగా తీసుకొని కేసులు ఫైల్ చేయవద్దు. ఎందుకంటే పోలీసులు మన సొంత తల్లుల వంటి వాళ్లు. మీ మితిమీరిన ప్రవర్తనను వల్ల కొట్టలేదు. కేవలం వారు మీపై ప్రేమ చూపించడానికే కొడుతారు’ అంటూ వర్మ తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు.
ఇక పోలీసుల చేతిలో దెబ్బలు తిని రఘురామ లాగా కేసులు ఫైల్ చేయాలని అనుకొనే వాళ్లకు వర్మ సలహా ఇచ్చారు. ‘పోలీసులు లాఠీ దెబ్బలు.. ప్రేమతో వేసిన దండలు లాంటివి. వాళ్లు తిట్టే తిట్లు మంచి కోరివేసే మంత్రాల లాంటివి. ఈ విషయాన్ని అర్థం చేసుకొని మూర్ఖులు పోలీసుల చేతిలో తన్నులు తినడం.. లాఠీ దెబ్బలు , వారిచే ముద్దులు పెట్టుకోవడానికి అర్హులు’ అంటూ వర్మ తనదైన శైలిలో సెటైర్లు కురిపించారు.
ఇక ప్రపంచంలో లాక్ డౌన్ ఉల్లంఘిస్తే ఎక్కడా పోలీసులు లాఠీలతో కొట్టడం జరిగిందా? అని వర్మ ప్రశ్నించారు. రఘురామ రాజు కాలివేళ్లు విరిగేలా కొట్టినట్టు రుజువైతే పోలీసులపై సుప్రీంకోర్టు జడ్జీలు యాక్షన్ తీసుకుంటారా? నాకు విషయం సరిగా తెలియక అడుగుతున్నాను’ అంటూ వర్మ మరో ట్వీట్ లో అనుమానాలు వ్యక్తం చేశాడు. రఘురా విషయంలో తప్పుగా ఆలోచిస్తే ఆర్ఆర్ఆర్ జడ్జీలను నన్ను ఎడ్యూకేట్ చేయాలి అంటూ వర్మ కామెంట్ చేశాడు.