సుశాంత్‌ ను చంపిన హంతకి మోసగత్తె ఆమె

Update: 2020-07-31 09:50 GMT
బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ రాజ్‌ పూత్‌ ఆత్మహత్యపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. దాదాపు రెండు నెలలు అవుతున్నా కూడా ఈ విషయంలో పోలీసులు విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ సమయంలో సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ పాట్న పోలీసులకు తన కొడుకు ఆత్మహత్యకు రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యులు అంటూ అనుమానంతో ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు ఇది చర్చనీయాంశం అవుతుంది. ఈ సమయంలో రియాను నెటిజన్స్‌ టార్గెట్‌ చేస్తున్నారు.

తాజాగా జేడీయూ నేత మహేశ్వర్‌ మాట్లాడుతూ రియాపై సంచలన ఆరోపణలు చేశాడు. సుశాంత్‌ ను డబ్బు కోసం ప్రేమ పేరుతో మోసం చేసింది. ఒక ప్లాన్‌ ప్రకారం సుశాంత్‌ ను ట్రాప్‌ చేసి ఆయన నుండి డబ్బులు లాగి ఆ తర్వాత చంపిందంటూ ఆరోపించాడు. సుశాంత్‌ మరణంకు కారణం అయిన రియా ఒక కాంట్రాక్ట్‌ కిల్లర్‌.. చీటర్‌ ఆమె విష కన్య అంటూ మహేశ్వర్‌ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తాడు.

సుశాంత్‌ కేసులో పోలీసులు ఆమెను వెంటనే అరెస్ట్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశాడు. ముంబయి పోలీసులు ఈ కేసును సమగ్రంగా విచారణ జరపడం లేదని అందుకే పాట్న పోలీసులకు ఈ కేసును అప్పగించాలంటూ మహేశ్వర్‌ డిమాండ్‌ చేశాడు.
Tags:    

Similar News