కాంతారలో రిషిబ్ శెట్టి వైఫ్ నటించారా?

Update: 2022-11-17 04:36 GMT
ఎలాంటి హడావుడి లేకుండా వచ్చి.. బాక్సాఫీస్ దుమ్మ దులిపేస్తున్న కాంతారకు సంబంధించిన ఆసక్తికర అంశాలు బోలెడన్ని ఒకటి తర్వాత ఒకటి చొప్పున బయటకు వస్తున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీలో హీరోగా నటించి..

సినిమాకు దర్శకుడిగా రిషిబ్ శెట్టి టాలెంట్ ఏమిటన్నది ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. అతగాడు నటించిన గత సినిమాలు చూస్తే.. అతడెంత వైవిధ్యమైన ఆర్టిస్టు అన్న విషయం తెలుస్తుంది. కానీ.. అతగాడి గొప్పతనం మాత్రం పెద్దగా బయటకు రాలేదు. కాంతార ఆ కొరతను తీర్చేయటమే కాదు.. యావత్ భారతానికి అతడ్ని సుపరిచితుడిగా మార్చేసింది.

ఒక్క సినిమాతో అతగాడి ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. ఇక.. ఈ మూవీలో  రిషిబ్ సతీమణి యాక్ట్ చేశారా? అంటే అవునంటున్నారు. మరి.. ఆమె ఎక్కడా కనిపించలేదే? అన్న క్వశ్చన్ రావొచ్చు. కానీ.. జాగ్రత్తగా చూస్తే.. ఆమె కనిపించేస్తుంది. అంతేకాదు. .ఈ మూవీకి క్యాస్టూమ్ డిజైనర్ అన్న కీ రోల్ ను ఆమె పోషించారు. ఇందుకోసం ఆమె పడిన కష్టంఅంతా ఇంతా కాదు.

ఇంతకీ ఆమె పేరేమిటి? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నది చూస్తే.. భర్త రిషిబ్ మాదిరే మల్టీ టాలెంటెడ్ అని చెప్పాలి. రిషిబ్ శెట్టి సతీమణి పేరు ప్రగతీ శెట్టి. వాస్తవానికి ఆమె ప్రముఖ ఐటీ కంపెనీలో ప్రాజెక్టు ఇంజినీర్ గా పని చేశారు. ఆ తర్వాత ఆమెకు క్యాస్టూమ్ డిజైనర్ గా పని చేయాలన్న తపనతో ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి.. తనకు నచ్చిన రంగంలోకి వచ్చేశారు. అదే సమయంలో నటన మీద తనకున్న అభిరుచికి తగ్గట్లుగా ఆమె కొన్ని పాత్రల్ని పోషిస్తుంటారు.

అలాంటి చిన్న పాత్రనే కాంతార మూవీలో పోషించారు. సినిమా ఆరంభంలో రాజు ఎపిసోడ్ వస్తుంది కదా? ఆ రాజు సతీమణిగా ప్రగతీ శెట్టి నటించారు. చాలా తక్కువ నిడివి ఉన్న ఈ పాత్రను పోషించే సమయానికి ఆమె గర్భవతి. ఒకవైపు ప్రెగ్నెంట్ గా ఉంటూనే సినిమాకు సంబంధించిన కాస్టూమ్ డిజైనింగ్ కోసం అడవుల చుట్టూ తిరిగి.. సహజ సిద్ధంగా ఉండేలా క్యాస్టూమ్స్ ను సిద్ధం చేసింది.

ఈ మూవీలో తాను కనిపించే తక్కువ నిడివిలోనూ మూడు చీరలు ధరించిన ఆమె.. అందులో ఒక చీర తన తల్లి పెళ్లినాడు ధరించిన చీర అని చెప్పుకొచ్చింది. ఈ సినిమాతో ఆమెకు క్యాస్టూమ్ డిజైనర్ గా మంచి పేరు వచ్చేసింది. కష్టానికి ప్రతిఫలం దొరకకుండా ఉంటుందా? ప్రగతీ శెట్టి పడిన కష్టానికి ఆమెకు తగిన గుర్తింపును కాంతార మూవీ ఇచ్చేసిందని చెప్పాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News