బాలీవుడ్ స్టార్ నటుడు - రిషికపూర్ క్యాన్సర్ వ్యాదితో బాధపడుతున్నాడంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. జాతీయ మీడియాలో ఈ వార్తలు ప్రముఖంగా వస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం అవి పుకార్లే అయ్యి ఉంటాయని భావించారు. క్యాన్సర్ వ్యాదితో బాధపడుతున్న రిషి కపూర్ చికిత్స పొందుతున్నారని, ఆయన త్వరలోనే కోలుకుంటారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానుల్లో గందరగోళ పరిస్థితి ఉంది. దాంతో రిషికపూర్ స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చాడు.
మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా నిజంగానే తాను క్యాన్సర్ వ్యాదితో పోరాడుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఈమద్యే తాను క్యాన్సర్ వ్యాదిగ్రస్తుడనని తేలింది. ప్రస్తుతం అమెరికాలో చికిత్స తీసుకుంటున్నాను. దేవుడి దయతో మళ్లీ పూర్తి ఆరోగ్యంగా మీ ముందుకు వస్తానంటూ రిషికపూర్ పేర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నేను సినిమాలు చేయకపోవడం సంతోషం. ప్రస్తుతం సినిమాలు లేక పోవడం వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉందన్నాడు.
బాలీవుడ్ కు చెందిన పలువురు తారలు ఇప్పటికే క్యాన్సర్ తో బాధపడుతున్నారు. సోనాలి బింద్రే - రాకేష్ రోషన్ తో పాటు ఇంకా ముగ్గురు నలుగురు స్టార్స్ కూడా క్యాన్సర్ తో పోరాడుతున్నారు. వారి జాబితాలో స్టార్ హీరో రణబీర్ కపూర్ తండ్రి కూడా చేరడం చాలా బాధాకరం. ఆయన తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవ్వాలంటూ అభిమానులు మరియు సన్నిహితులు కోరుకుంటున్నారు. బాలీవుడ్ కు చెందిన పలువురు క్యాన్సర్ ను జయించారు. కనుక రిషి కపూర్ కూడా క్యాన్సర్ ను జయిస్తాడని ఆశిద్దాం.