బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు విచారణ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బీహార్ పోలీసుల ఎఫ్.ఐ.ఆర్ నివేదిక పరిశీలించిన సీబీఐ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు మరో ఐదుగురిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది. ఈ నేపథ్యంలో సుశాంత్ సూసైడ్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న రియా ఈ కేసులో సీబీఐ విచారణ చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు రాకముందే సీబీఐ విచారణ ప్రారంభించడం చట్ట విరుద్ధమంటూ ఈ మేరకు గురువారం రియా ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ఆమె ''ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. న్యాయ సూత్రాలకు అతీతం. దేశ సమాఖ్య స్పూర్తిపై ప్రభావం చూపుతుంది'' అని పేర్కొన్నారు.
కాగా సుశాంత్ తో సహ జీవనం చేసిన రియా చక్రవర్తే అతడిని ఆత్మహత్యకు ప్రేరేపించిందని.. డబ్బు తీసుకుని మోసం చేసిందంటూ అతడి తండ్రి కేకే సింగ్ బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. దీంతో ఈ కేసుని ముంబై పోలీసులకు బదిలీ చేయాలని కోరుతూ రియా చక్రవర్తి పిటిషన్ దాఖలు చేయించి. గత ఏడాది కాలంగా సుశాంత్ తో సహజీవనం చేసానని.. జూన్ 8న సుశాంత్ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయినట్లు కోర్టుకు తెలిపింది. డిప్రెషన్ తో బాధ పడుతున్న సుశాంత్ మెడిసిన్ వాడేవాడని.. ఈ క్రమంలో జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. అప్పటి నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని.. ప్రియుడి మరణంతో కుంగిపోయిన తనను కొంత మంది అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని సుప్రీంకోర్టుకు తెలిపారు రియా.
ఈ నేపథ్యంలో ఇటీవల ఓ వీడియో ద్వారా ''నాకు దేవుడి మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. నాకు న్యాయం జరుగుతుంది. సత్యమేవ జయతే'' అని పేర్కొంది. అంతకముందు కేంద్ర హోమంత్రి అమిత్ షా కి ట్వీట్ చేస్తూ ''నేను సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి. నేను న్యాయాన్ని విశ్వసిస్తాను. సుశాంత్ కేసులో నిజాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. సుశాంత్ మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని నేను మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాను'' అని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు సుశాంత్ కేసుని సీబీఐకి అప్పగించిన తర్వాత సుప్రీంకోర్టులో నేను వేసిన పిటిషన్ పై తీర్పు రాక ముందే సీబీఐ విచారణ మొదలుపెట్టడం సరికాదని రియా అంటున్నారు. దీంతో రియా చక్రవర్తి తీరుపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.