ఎమ్మెల్యే రోజా భర్తకు కీలక పదవి

Update: 2019-07-22 05:53 GMT
ఫైర్ బ్రాండ్ - వైసీపీ ఎమ్మెల్యే రోజాకు జగన్ కేబినెట్ లో చోటు దక్కకపోవడంతో జరిగిన రచ్చ అంతా ఇంతాకాదు.. ఆమెపై చాలా మంది సానుభూతి చూపించారు. దీంతో అలెర్ట్ అయిన జగన్ రోజాకు అతికీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవిని కట్టబెట్టి అసంతృప్తి చల్లార్చారు. పార్టీ కోసం ఎంతో కష్టపడిన రోజా కృషికి గుర్తింపు లభించింది.

అయితే ఇప్పుడు ఎమ్మెల్యే రోజా భర్తకు కూడా ఓ పదవి లభించడం విశేషం. అయితే రోజా భర్తకు దక్కింది రాజకీయ పదవి కాదు.. సినిమా పదవి. ఎమ్మెల్యే రోజా భర్త ఆర్కే సెల్వమణి తమిళనాడు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హోరా హోరీగా సాగిన ఈ ఎన్నికల్లో సెల్వమణి భారీ మెజారిటీతో విజయం సాధించడం విశేషం.

గత జూన్ నెలలోనే తమిళనాడు దర్శకుల సంఘానికి ఎన్నికలు జరిగాయి. భారతీరాజా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఆయన ఎన్నికపై వివాదం చెలరేగడం.. కొందరు అభ్యంతరం తెలుపడంతో భారతీరాజా తప్పుకున్నారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించగా సెల్వమణి మరో తమిళ దర్శకుడు విద్యాసాగర్ పై గెలుపొందారు. మొత్తం 1900 ఓట్లు ఉండగా.. 1503మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. సెల్వమణి 1386ఓట్ల మెజారిటీతో గెలుపొందడం విశేషం.

ఆగస్టు 10 - 2002లో రోజాను సెల్వమణి వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కుమారుడున్నారు. సెల్వమణి తమిళనాడులోనే ఉంటూ వృత్తిని కొనసాగిస్తుండగా.. రోజా ఎమ్మెల్యేగా ఏపీ లో కొనసాగుతున్నారు.
Tags:    

Similar News