ముంబై భామలకు షాక్ ఇచ్చేశారుగా

Update: 2017-03-24 16:55 GMT
ఉత్తరాది హీరోయిన్లకు అక్కడ అంతగా అవకాశాలు లేకపోయినా.. సౌత్ లో వెలిగిపోవడం.. తెగ డిమాండ్లు చేయడం బాగా కామన్. ఇక్కడకొచ్చి అరంగేట్రం చేసే వాళ్లు కూడా తెగ పోజులు కొట్టేస్తుంటారు. ఇక కాసింత క్రేజ్ ఉన్న ముంబై హీరోయిన్లు అయితే.. తమ డిమాండ్లతో నిర్మాతలకు తలబొప్పి కట్టించేస్తుంటారు.

ముఖ్యంగా హీరోయిన్లు తమకు కావాల్సిన టెక్నీషియన్లను ముంబై నుంచి భారీ మొత్తం వెచ్చించి తెచ్చుకుంటారు. అక్కడి కాస్ట్లీ మేకప్ ఆర్టిస్టులు.. కాస్ట్యూమ్ డిజైనర్లు.. హెయిర్ స్టైలిష్టులు ఛార్జ్ చేసే బిల్లులను నిర్మాతలకు విపరీతంగా ఖర్చు అయిపోతున్నా.. ఏం చేయలేని పరిస్థితి. కానీ వీరి ఆగడాలకు చెక్ పెడుతూ ఆర్కే సెల్వమణి నిర్ణయం తీసుకున్నారు. ఫిలిం ఎంప్లాటీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు కొత్త ప్రెసిడెంట్ గా ఎన్నికైన ఈయన.. తన కొత్త నిర్ణయాలతో ముంబై భామలకు షాక్ ఇచ్చేశారు.

ముంబై హీరోయిన్లు తమిళ సినిమాల్లో నటిస్తున్నపుడు.. వారు ముంబై టెక్నీషియన్ల సర్వీసులను ఉపయోగించుకునే అవకాశం లేదని.. నిర్మాతలు ఎంపిక చేసినవారితోనే సేవలు పొందాలని కరాఖండీగా చెప్పుకొచ్చారు. మరి తమిళ పరిశ్రమ తీసుకున్న ఈ కొత్త నిర్ణయానికి.. బాలీవుడ్ భామల రియాక్షన్ ఎలా ఉంటుందో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News