సూపర్ స్టార్ రజనీకాంత్- అక్షయ్ కుమార్- శంకర్ కాంబినేషన్ మూవీ 2.ఓ ఈనెల 29న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు - తమిళనాడు - కర్నాటక - కేరళతో పాటు ఉత్తరాదిన ఈ చిత్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతోంది. తమిళనాడు - మలేషియా - అమెరికా - బ్రిటన్ - చైనా - జపాన్ మార్కెట్లను టార్గెట్ చేసి అత్యంత భారీగా రిలీజ్ చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచి ఈసారి వసూళ్ల పరంగా భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 550కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.
ఇప్పటికే రిలీజైన ట్రైలర్ 14కోట్ల వ్యూస్ ని అందుకుని - రికార్డ్ స్థాయిలో 20కోట్ల వ్యూస్ దిశగా దూసుకెళుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై అభిమానులకు ఉన్న ఉత్కంఠ ఏపాటిదో ట్రైలర్ కు దక్కుతున్న ఆదరణ చెబుతోంది. మరో 15రోజుల్లో బాక్సాఫీస్ వద్ద అసలు సిసలు సంచలనాలు నమోదు కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. రజనీ చిట్టీగా చేయబోతున్న విన్యాసాలు - అక్షయ్ క్రోమ్యాన్ గా విన్యాసాలు వీక్షించేందుకు అభిమానులు ప్రిపేరవుతున్నారు.
లేటెస్ట్ గా 2.ఓ తమిళ వెర్షన్ సెన్సార్ పనులు పూర్తయ్యాయి. యుఏ సర్టిఫికెట్ ఇచ్చి సెన్సార్ బృందం ప్రశంసించిందని తెలుస్తోంది. అయితే సెన్సార్ వివరాల్ని లైకా సంస్థ ప్రకటించిన అనంతరం రజనీ అభిమానుల్లో సామాజిక మాధ్యమాల వేదికగా ఆసక్తికర చర్చ సాగింది. ఇది 3డి సినిమా కాబట్టే `యుఏ` ఇచ్చారు. 2డి అయితే `యు` సర్టిఫికెట్ ఇచ్చేవారేమో? అయినా 3డి ఏం వద్దు.. 4డి కావాలి! అంటూ కొందరు అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా డిబేట్ ని రన్ చేశారు. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని మునుముందు సినిమాలు తీసే విధానం మారాలన్నది ఫ్యాన్స్ ఆసక్తి అని అర్థమవుతోంది. 2డి సినిమాలకు కాలం చెల్లి పూర్తిగా 3డి సినిమాల ట్రెండ్ మునుముందు రానుంది. 3డి కంటే అడ్వాన్స్ డ్ టెక్నాలజీని సినీరంగాన్ని సమూలంగా మార్చేయడం ఖాయమన్న చర్చా సాగుతోంది. 2.ఓ చిత్రాన్ని 3డి కెమెరాలతో తెరకెక్కించి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.