ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తున్న ఇండియన్ సినిమాల్లో ఒకటి ‘కేజీఎఫ్-2’. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా.. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై ఓ రేంజ్ లో హైప్ క్రియేటయ్యింది. తొలి పార్ట్ దుమ్ములేపడంతో.. ఈ సీక్వెల్ ఇంకెంత అద్భుతంగా ఉంటుందోనని సగటు ప్రేక్షకుడు ఎదురు చూస్తున్నారు.
గత నెలలో విడుదలైన టీజర్.. ప్రేక్షకుల అంచనాలను అమాంతం పెంచేసింది. ‘అంతకు మించి’ అన్నట్టుగా.. మొదటి పార్టు కన్నా.. సీక్వెల్ లో యాక్షన్ దుమ్ము రేగుతుందని టీజర్ తోనే కేక పెట్టించాడు దర్శకుడు. యూట్యూబ్ లో వ్యూస్ తోపాటు లైక్స్, కామెంట్ల విషయంలో నెవ్వర్ బిఫోర్ రికార్డులను సెట్ చేసిందీ టీజర్. దీంతో.. కేజీఎఫ్-2 మేనియా ఇప్పుడు మామూలుగా లేదు.
ఈ హైప్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు మేకర్స్. అయితే.. ఎంత ధర నిర్ణయించినా.. కేజీఎఫ్-2ను హాట్ కేకులా అందుకునేందుకు చూస్తున్నారట పంపిణీదారులు! దీంతో.. ఈ చిత్ర బిజినెస్ ఆకాశాన్ని తాకుతున్నట్టు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలలో ఓ రేంజ్ లో కోట్ చేస్తున్నారట డిస్ట్రిబ్యూటర్స్.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. కేజీఎఫ్ చాప్టర్- 2 ఉత్తరాంధ్ర హక్కులను ప్రముఖ పంపిణీదారులు రూ.16 కోట్లకు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే.. మేకర్స్ మాత్రం రూ .20 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. దీంతో బేరసారాలు సాగుతున్నాయి. మధ్యే మార్గంగా రూ .18 కోట్లకు ఈ డీల్ క్లించ్ ఔట్ అవుతుందని సమాచారం.
ఇక, నైజాం హక్కుల గురించి తెలుసుకొని గుడ్లు తేలేస్తున్నారు చాలా మంది. నైజాం ఏరియాలో కేజీఎఫ్-2 హక్కులు రూ .40 నుంచి 45 కోట్ల మధ్య పలుకుతున్నాయట. ఈ మొత్తం కాస్త పెరిగినా ఆశ్చర్యం లేదట. ఈ రేటు అల్లు అర్జున్ పుష్ప సినిమా ధరకు సమానం లేదా అంతకన్నా ఎక్కువ కూడా కావొచ్చట. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, సీడెడ్, ఆంధ్ర హక్కులు సేల్ చేయడ ద్వారా.. కనీసం 120 కోట్ల రూపాయలు రాబట్టాలని చూస్తున్నారట మేకర్స్.
ఒక డబ్బింగ్ సినిమా తెలుగులో సృష్టిస్తున్న సంచలనం ఇదంతా! ఇది అగ్రశ్రేణి టాలీవుడ్ టాప్ హీరోల చిత్రాలకు సమానం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక, ఈ చిత్రం ఓవర్సీస్ హక్కుల రేట్లు కూడా నేలమీద లేవట! ఓవర్సీస్ హక్కులు పొందాలంటే ఏకంగా రూ. 80 కోట్లు చెల్లించాల్సిందేనని చెబుతున్నారట మేకర్స్. ఈ రేట్ ను అందుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారట డిస్ట్రిబ్యూటర్స్. మొత్తానికి.. విడుదలకు ముందే ఈ స్థాయిలో గర్జిస్తున్న కేజీఎఫ్-2.. రిలీజ్ తర్వాత ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.