పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'రొమాంటిక్' సినిమా ప్రమోషన్స్ బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. తనతో 'బుజ్జిగాడు' 'ఏక్ నిరంజన్' వంటి సినిమాలు తీసిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ఇందులో హీరో. అందుకే అంత బిజీ షెడ్యూల్ లో కూడా ఈ సినిమా ప్రచార కార్యక్రమాల కోసం ఒక రోజంతా కేటాయించి తనవంతు సపోర్ట్ ఇచ్చారు ప్రభాస్.
ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న 'రొమాంటిక్' సినిమా గురించిన విశేషాలు ఇంతగా వైరల్ అవుతున్నాయంటే.. అది ఖచ్చితంగా ప్రభాస్ వల్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే 'రొమాంటిక్' సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేసిన ప్రభాస్.. ఈ సినిమాకు బజ్ తీసుకొచ్చారు. అలానే ఆకాష్ తో రొమాంటిక్ రీల్స్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో హీరోహీరోయిన్లతో ఓ స్పెషల్ టాక్ సెషన్ కూడా నిర్వహించారు డార్లింగ్.
అనిల్ పాదురి దర్శకత్వంలో ఆకాష్ - కేతిక శర్మ జంటగా రూపొందిన ''రొమాంటిక్'' చిత్రాన్ని అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దీనికి పూరీ జగన్నాథ్ కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. మరో మూడు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. ప్రమోషన్స్ లో భాగంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పెషల్ టాక్ సెషన్ ని చిత్ర బృందం తాజాగా రిలీజ్ చేసింది.
'రొమాంటిక్ డేట్ విత్ డార్లింగ్ ప్రభాస్' అనే పేరుతో వచ్చిన ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తెర మీద చాలా గంభీరంగా కనిపించే ప్రభాస్.. ఈ ఇంటర్వ్యూ ఆకాష్ - కేతిక శర్మ లను ఫన్నీగా ఇంటర్వ్యూ చేశారు. ఎవరూ ఊహించని విధంగా ప్రవర్తిస్తూ.. హీరోహీరోయిన్ల మాటలకు సరదాగా కౌంటర్లు వేస్తూ సందడి చేశారు.
చిన్నప్పటి నుంచి తాను ఆకాష్ ఇద్దరం కలిసి పెరిగామని.. ఒకే వయసు వాళ్ళం.. పెరిగి పెద్దవాడై ఇప్పుడు 'రొమాంటిక్' సినిమా చేస్తున్నారంటూ ఫన్నీగా ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు ప్రభాస్. ఇంటర్వ్యూ ప్రారంభంలో హీరోయిన్ తనకు తాను పరిచయం చేసుకుంటూ.. 'హాయ్ సర్.. ఐ యామ్ కేతిక.. ఫ్రమ్ ఢిల్లీ' అని చెప్పింది. దీనికి వెంటనే 'హాయ్ మేడమ్.. ఐ యామ్ ప్రభాస్ మొగల్తూరు' అని నవ్వుతూ అన్నారు. ఏంటి సార్ ఇది.. మీరు పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదు.. మీరొక యూనివర్సల్ స్టార్ అంటూ కేతిక శర్మ వినయంగా చెప్పింది.
కేతిక మంచి సింగర్ అని ఆకాష్ చెప్పగా.. తమ కోసం ఒక పాట పాడమని ప్రభాస్ కోరాడు. దానికి కేతిక శర్మ 'నేను ఒక బాత్రూమ్ సింగర్ ని సార్' అంటూ సిగ్గు పడింది. వెంటనే ఆకాష్ అందుకుని 'సరే ఇది నీ బాత్రూమ్ అనుకో.. ఇక్కడ నేను లేను, డార్లింగ్ లేడు.. ఏం డార్లింగ్' అని అన్నాడు. దీనికి ప్రభాస్ 'ఆ అమ్మాయి బాత్రూమ్ లో నేను ఎందుకు ఉంటారా?.. నేను కూడా లేను. నువ్వు పాడు గజాలా' అంటూ కళ్ళు ముసుకున్నారు. ఇలా ఇంటర్వ్యూ మొత్తం సరదాగా సాగింది.
ఇందులో భాగంగా ఆకాష్ 'బుజ్జిగాడు' సినిమాలోని డైలాగ్ చెప్పి.. వినయంగా ప్రభాస్ కాళ్ళు తాకడం కూడా కనిపిస్తుంది. ఈ సందర్భంగా తనకు సపోర్ట్ చేసినందుకు ప్రభాస్ కు పూరీ తనయుడు కృతజ్ఞతలు తెలిపాడు. ప్రభాస్ కూడా ఆకాష్ తల్లి లావణ్య యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో వెల్లడించారు. చివర్లో 'రొమాంటిక్' హీరో హీరోయిన్లు ఇద్దరూ ప్రభాస్ ను హగ్ చేసుకొని ఇంటర్వ్యూ ముగించారు.
Full View