మిస్సెస్ వైట్ల.. ఆ గొడవ సంగతేంటి?

Update: 2017-04-14 04:26 GMT
''మిష్టర్'' సినిమాకు మరోసారి తన క్రియేటివిటీకి పని చెప్పింది రూప వైట్ల. దర్శకుడు శ్రీను వైట్లగా సుపరిచితం అయిన ఈవిడ.. చాలాకాలం నుండి వైట్ల సినిమాల్లో హీరోయిన్లకు బట్టలు డిజైన్ చేస్తోంది. దూకుడు సినిమాలో సమంతకు వేసిన బట్లకు గాను ఈవిడకు బాగానే పేరొచ్చింది. ఇప్పుడు మిష్టర్ సినిమాలో కూడా హీరోయిన్ లావణ్య త్రిపాఠికి అటువంటి ఔటుఫిట్లే ఇచ్చిందిలే. ఇప్పటికే రూప వైట్ల డిజైన్ చేసిన ఆ దుస్తులకు బాగా పేరు వచ్చేయడంతో.. ఇప్పుడు మిష్టర్ టీమ్ తమ డిజైనర్లను కూడా ఇంటర్యూకు పంపించింది.

అసలు ఆనందం సినిమా రిలీజు టైముకే తాను వైట్ల ఎలా ప్రేమలో పడిందీ.. తమ కెరియర్లు ఎలా ప్లాన్ చేసుకుంది.. ఇటువంటి చాలా విషయాలే ఈమె ఇంటర్యూల్లో చెబుతోంది. అయితే ఇవన్నీ జనాలకు చాలామందికి ఆల్రెడీ తెలిసినవే. కాని వారు వినాలని అనుకుంటోంది ఇంకోటి ఉంది.  బ్రూస్ లీ సినిమా రిలీజయ్యాక.. శ్రీను వైట్ల తనపై చేయి చేసుకున్నారని.. రూప వైట్ల జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దాదాపు ఇద్దరూ డైవర్స్ తీసుకుంటారని అనుకున్నారు. ఇంతలో కొందరు సినీ పెద్దలు కలిపించుకుని.. యవ్వారాన్ని కామ్ గా సెటిల్ చేశారని అప్పట్లో చాలామంది మీడియా వారు ఆధారాలతో హడావుడి చేశారు. ఇప్పుడు మిస్సెస్ వైట్ల ఆ గొడవ గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా?

అంటే.. క్రియేటివ్ ఫీల్డులో ఉన్న భార్యాభర్తల మధ్యన ఇష్యూస్ వస్తే.. వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో అర్దంచేసుకోవడానికి.. వీరి సంఘటన ఒక థీసిస్ లా ఉపయోగపడుతుంది కదా సుమీ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News