వరల్డ్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'RRR' ('రౌద్రం రణం రుధిరం') చిత్రం.. రేపు (మే 20) డిజిటల్ స్క్రీన్ మీదకు రానున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ZEE5 లో ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా స్ట్రీమింగ్ కానుంది. అయితే పే పర్ వ్యూ విధానంలో ఈ సినిమా అందుబాటులో ఉంటుందని ఇంతకుముందు ప్రకటించారు. కానీ ఆ నిర్ణయాన్ని ప్రేక్షకులు స్వాగతించడం లేదు.
ఇప్పటికే ఉన్న ZEE5 సబ్ స్క్రైబర్ లకు 'RRR' చిత్రాన్ని ఉచితంగా అందించాలని సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని జీ5 టీమ్.. T-VOD మోడ్ ను తొలగించాలని నిర్ణయించింది. చందాదారులందరికీ 'RRR' ను ఫ్రీ గా చూసే అవకాశం కల్పించాలని నిర్ణయించింది.
జీ5 సబ్ స్క్రైబర్‌లు/పెయిడ్ యూజర్‌లకు మే 20 నుండి 'ఆర్.ఆర్.ఆర్' సినిమాను ఉచితంగా అందించనున్నారు. S-VODలో ఈరోజు అర్థరాత్రి 12 గంటల నుండి ఈ సినిమా వీక్షకులకు అందుబాటులో ఉంటుంది. RRR ప్లస్ జీ5 వార్షిక చందా రూ. 699 చెల్లించి కాంబో ప్యాక్ ని కొనుగోలు చేసిన వినియోగదారులందరికీ.. మూడు నెలలు అదనపు కాలపరిమితి చెల్లుబాటు అయ్యేవిధంగా అందించడం జరుగుతుందని ఓటీటీ సంస్థ తెలిపింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు SS రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన దృశ్య కావ్యం ''ఆర్.ఆర్.ఆర్''. మరికొన్ని గంటల్లో 'ZEE5' ఓటీటీ వేదికగా తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను వీక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
'RRR' థియేటర్లలో విడుదలై 50 రోజులు దాటింది. మార్చి 25న గ్రాండ్ గా రిలీజ్ కాబడిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1130 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో.. ZEE5 వారు ఈ స్పెషల్ డే నాడు ఆయన అభిమానులకు కానుకగా డిజిటల్ తెరపైకి "RRR" ప్రీమియర్ ను అందిస్తున్నారు. అత్యుత్తమ 4K నాణ్యతలో మరియు డాల్బీ అట్మాస్ తో అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇటీవల కాలంలో "ZEE5" ఓటీటీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషల్లో వివిధ ఫార్మాట్‌లలో అనేక రకాల కంటెంట్ ను వీక్షకులకు నిర్విరామంగా అందిస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త వినోదంతో వీక్షకులను ఆకట్టుకుంటూ ఓటీటీలలోనే ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ గా దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది.
ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు - ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ చేస్తున్న జీ5.. ఇప్పుడు "RRR" (రౌద్రం రణమ్ రుధిరం) సినిమాని నాలుగు దక్షిణాది భాషలలో తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉండటం వల్ల కేవలం సౌత్ ఆడియన్స్ కాకుండా.. ఇతర భాషల వాళ్ళు కూడా వీక్షించే అవకాశం ఉంది.
మొత్తం మీద ఈ సంవత్సరంలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ అయిన RRR.. ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదల చేయబడిన ఓటీటీ కట్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఎప్పుడెప్పుడా ఓటీటీలో చూడాలా అనే ఆతృతను రెట్టింపు చేసింది.
ఇందులో తారక్ - చరణ్ లతో పాటుగా ఆలియా భట్ - ఒలివియా మోరిస్ - అజయ్ దేవగణ్ - శ్రియ - సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. బిగ్ స్క్రీన్ పై వండర్స్ క్రియేట్ చేసిన 'ఆర్.ఆర్.ఆర్'.. డిజిటల్ స్క్రీన్ మీద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.