టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లకు పైగా వసూళ్లు సాధించింది. మరో వారం పది రోజుల పాటు సినిమా సందడి.. జోరు కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ ప్రతి ఒక్కరు నమ్మకంతో ఉన్నారు. ఈ సమయంలోనే సినిమా యొక్క సీక్వెల్ గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఈమద్య కాలంలో సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ చేస్తున్నారు. అంతేఎందుకు రాజమౌళి స్వయంగా బాహుబలి ని రెండు పార్ట్ లుగా తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఇప్పుడు అదే తరహాలో ఆర్ ఆర్ ఆర్ సినిమాకు కూడా సీక్వెల్ రాబోతుంది అంటూ ప్రచారం మొదలు అయ్యింది. ఈ విషయాన్ని మీడియా వారు రాజమౌళి మరియు ఇద్దరు హీరోలు ఇంకా రచయిత వద్దకు తీసుకు వెళ్లడం జరిగింది.
రాజమౌళి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మాట్లాడుతున్న సమయంలో ఎన్టీఆర్.. చరణ్ ఓకే అంటే తాను ఈ సినిమా సీక్వెల్ కు ఓకే అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ కూడా స్పందిస్తూ జక్కన్న అడిగితే తాను కూడా నో చెప్పను అన్నట్లుగా వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇక విజయేంద్ర ప్రసాద్ కూడా ఇప్పటి వరకు ఆ ఆలోచన అయితే లేదు కాని భవిష్యత్తులో ఉంటుందేమో అన్నట్లుగా పేర్కొన్నాడు.
వీరంతా కూడా చేసిన వ్యాఖ్యలతో ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సీక్వెల్ వస్తుందేమో అంటూ ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా కథ కు సీక్వెల్ కు స్కోప్ లేదు అనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే రచయిత మరియు దర్శకుడు తల్చుకుంటే సీక్వెల్ ను మొదలు పెట్టవచ్చు. లేదంటే అవే పాత్రలతో కథను కొత్తగా కూడా తీసుకు రావచ్చు. కాని ఆ ఆలోచన వారికి లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరి ఎందుకు వారు అంతా కూడా సీక్వెల్ కు సిద్దం.. చేద్దాం.. చూద్దాం అంటున్నారంటే.. ఇప్పడు ఆర్ ఆర్ ఆర్ సినిమా హడావుడి కొనసాగుతుంది. ఆ హడావుడి మరికొన్ని రోజులు పెరగాలి.. ఏదో ఒక విషయం తో మీడియాలో ఈ సినిమా గురించి చర్చ జరగాలి. తద్వారా సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవ్వాలి. అందుకే వారంత కూడా సీక్వెల్ పదాన్ని వాడుతున్నారు.. మీడియా వారు చెప్పినప్పుడు నో అంటే సింపుల్ గా చర్చ పూర్తి అవుతుంది.
అలా కాకుండా చేస్తామేమో.. వాళ్లు ఓకే అంటే నేను ఓకే ఇలా వ్యఖ్యలు చేస్తే మీడియాలో ఆర్ ఆర్ ఆర్ సినిమాకు మంచి మైలేజ్ దక్కుతుంది. తద్వారా సినిమా వసూళ్లు మరింతగా పెరుగుతాయని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కావచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈగ కు సీక్వెల్ అన్నారు.. అది ఎలా అయితే వచ్చిందో ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ కూడా అంతే అనేది కొందరి అభిప్రాయం.